MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money2ffb0a61-a7d3-487c-873d-898934dcba8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money2ffb0a61-a7d3-487c-873d-898934dcba8e-415x250-IndiaHerald.jpg ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నా షేర్ మార్కెట్ మాత్రం ఉరుకుల పరుగులమధ్య మధ్యమధ్య వచ్చిన చిన్నచిన్న అవాంతరాలను అధిగమించి దూసుకుపోతూనే ఉంది. ప్రైమ్ డేటా బేస్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరంలో ఈక్విటీ ల ద్వారా 1.78 లక్షల కోట్లు అనేక కంపెనీలకు మూలధనం సమీకరణ ప్రైమరీ ఇష్యూల ద్వారా జరిగింది అన్న అంచనాలు చూస్తుంటే అనేక కంపెనీలకు ముగిసిపోతున్న ఈ సంవత్సరం పట్టిందల్లా డబ్బుగా మారింది అన్న క్లారిటీ వస్తుంది.ప్రైమ్ డేటా బేస్ గణాంకాల ప్రకారం గత సంవత్సరం 2019తో పోల్చుకుంటే ఈ సంవత్సరం వివిధ కmoney money;hyderabad;india;american samoa;donald trump;vegetable market;central government;paruguడబ్బే డబ్బు : పట్టిందల్లా డబ్బు !డబ్బే డబ్బు : పట్టిందల్లా డబ్బు !money money;hyderabad;india;american samoa;donald trump;vegetable market;central government;paruguWed, 30 Dec 2020 11:00:00 GMTఈ సంవత్సరం కోవిడ్ కారణంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నా షేర్ మార్కెట్ మాత్రం ఉరుకుల పరుగులమధ్య మధ్యమధ్య వచ్చిన చిన్నచిన్న అవాంతరాలను అధిగమించి దూసుకుపోతూనే ఉంది. ప్రైమ్ డేటా బేస్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరంలో ఈక్విటీ ల ద్వారా 1.78 లక్షల కోట్లు అనేక కంపెనీలకు మూలధనం సమీకరణ ప్రైమరీ ఇష్యూల ద్వారా జరిగింది అన్న అంచనాలు చూస్తుంటే అనేక కంపెనీలకు ముగిసిపోతున్న ఈ సంవత్సరం పట్టిందల్లా డబ్బుగా మారింది అన్న క్లారిటీ వస్తుంది.


ప్రైమ్ డేటా బేస్ గణాంకాల ప్రకారం గత సంవత్సరం 2019తో పోల్చుకుంటే ఈ సంవత్సరం వివిధ కంపెనీలకు ఈక్విటీల ద్వారా వచ్చిన సొమ్ము 116 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. అంతేకాదు వివిధ కంపెనీలు సేకరించిన బాండ్లకు కూడ విపరీతమైన స్పందన వచ్చి సుమారు 7,400 కోట్ల డబ్బును ప్రజలనుండి కంపెనీలు తమ కార్యకలాపాల కోసం చాల సులువుగా ప్రజల పొదుపు మొత్తాల నుండి వసూలు చేసుకోగలిగాయి అంటే ప్రస్తుతం సామాన్య ప్రజలలో కూడ షేర్ మార్కెట్ పై ఎంత నమ్మకం పెరిగిందో అర్థం అవుతుంది.


అనేక ప్రముఖ కంపెనీలు ఈ సంవత్సరం ఇష్యూ చేసిన ఐపిఓ లలో చిన్న మదుపర్లు ఎగువ మధ్యతరగతి వర్గం వారు బాగా ఉత్సాహంగా నమ్మకంతో పెట్టుబడులు పెట్టడంతో వివిధ కంపెనీల ఐపిఓ లకు ఇలాంటి మంచి స్పందన వచ్చింది అని అంటున్నారు. ఈ సంవత్సరంలో అత్యధికంగా నిధులు సమీకరించిన పబ్లిక్ ఇష్యూ ఎస్ బి ఐ కార్డ్ సంస్థకు చెందినది.


దాని తరువాత హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్రాండ్ ఫార్మా 6,480 కోట్లు సమీకరించి రెండవ స్థానంలో నిలిచింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజ్ పై ట్రంప్ చివరి నిముషంలో సంతకం చేయడంతో పాట అనేక సానుకూల పరిణామాలతో పాటు కోవిడ్ టికా కు త్వరలోనే అనుమతులు వస్తాయి అన్న అంచనాలతో పాటు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఇప్పటికే భారత్ కోసం తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది అన్న వార్తలు రావడంతో మదుపర్లలో కరోనా భయాలు తగ్గి షేర్ మార్కెట్ పరుగులు పెడుతోంది..  




కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>