PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో తెలిసిందే. దీన్ని నియంత్రించడం కోసం చాలా దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ.. జర్మనీలోని బయాన్‌టెక్ సంస్థతో కలిసి ఓ టీకాను సిద్దం చేసింది. ఇది కరోనాను 95శాతం వరకూ నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది.phyzer;christmas;american samoa;december;california;local language;shaktiఫైజర్ టీకా ఫెయిల్?.. వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా!ఫైజర్ టీకా ఫెయిల్?.. వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా!phyzer;christmas;american samoa;december;california;local language;shaktiWed, 30 Dec 2020 20:59:41 GMTకాలిఫోర్నియా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో తెలిసిందే. దీన్ని నియంత్రించడం కోసం చాలా దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ.. జర్మనీలోని బయాన్‌టెక్ సంస్థతో కలిసి ఓ టీకాను సిద్దం చేసింది. ఇది కరోనాను 95శాతం వరకూ నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. దీంతో కరోనాపై దాదాపు విజయం సాధించినట్లే అని ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ఈ టీకాకు తొలుత బ్రిటన్ దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతలు లభించాయి. ఆ తర్వాత చాలా దేశాలు బ్రిటన్ బాటలో నడిచాయి. చివరకు అగ్రరాజ్యం అమెరికా కూడా ఫైజర్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ టీకా చూసి ధైర్యం తెచ్చుకున్న చాలా మందికి ఓ షాకింగ్ వార్త తెలిసింది. అదేంటంటే.. ఫైజర్ టీకా వేయించుకున్న వారం తరువాత ఓ నర్సుకు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని సదరు పురుష నర్సు స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని  కాలిఫోర్నియాకు చెందిన మాథ్యూస్ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా పని చేస్తున్నాడు. అయితే.. ఫైజర్ టీకాకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాథ్యూస్‌కు కూడా టీకా వేశారు. డిసెంబర్ 18న ఈ టీకా తొలి డోసును ఆయనకు ఇచ్చారు. టీకా తీసుకున్న ప్రాంతం కొద్దిగా ఎర్రబడటం తప్ప తన శరీరంలో ఎటువంటి ఇబ్బందులూ కనబడలేదని మాథ్యూస్ వెల్లడించారు.

ఇలా టీకా తీసుకున్న తరువాత అంటే.. క్రిస్మస్ సందర్భంగా విధుల్లో ఉన్న మాథ్యూస్‌కు ఆరోగ్యం బాగాలేనట్లు అనిపించింది. ఆ తరువాత కొద్ది సేపటికే చలి, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. దీంతో భయపడిన మాథ్యూస్.. ఆ మరుసటి రోజు కరోనా టెస్టు చేయించుకున్నాడు. దానిలో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే ఇలా జరగడం ఆందోళన పడాల్సిన అంశం కాదని స్థానికంగా ఉన్న ఓ అంటువ్యాధుల నిపుణుడు ఒకరు తెలిపారు. ‘టీకా తీసుకున్న 10 నుంచి 14 రోజుల తరువాతే  మన రోగనిరోధక శక్తి (ఇమ్యునిటీ) మెరుగవుతుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అంటే కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో మన శరీరం సన్నధ్దం కావడానికి కొంత సమయం పడుతుందన్నమాట. తొలి డోసు తీసుకున్నాక.. మనలో ఇమ్మునిటీ 50 శాతానికి, రెండో డోసు తరువాత 95 శాతానికి పెరుగుతుంది’ అని ఆయన వివరించారు.


అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>