PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/sucharithae7aead4b-1d95-432e-96e9-b69e3c94e04f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/sucharithae7aead4b-1d95-432e-96e9-b69e3c94e04f-415x250-IndiaHerald.jpgఇక‌, ఈ విష యం తెలిసి హోంమంత్రి సుచరిత త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించారు. ఇక్కడ జరిగిన సంఘటన తీవ్ర ఆవేదన కలిగించింద‌న్న ఆమె.. నిరుపేదలకు, ప్రత్యేకించి ఎస్సీలకు రాజధానిలో ఇళ్ళ పట్టాలు ఇవ్వటా నికి వీల్లేదు.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పటానికి వీల్లేదు... రాజధాని విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు న్యాయం జరగటానికి వీల్లేదు... అంటూ ఇలాంటి వాదనలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుడికి మనం విడిపోవటం కావాలి- అని విష‌యాన్ని చాలా చాక‌చ‌క్యంగా ముందుకు తీసుకువెళ్లారు.sucharitha;view;mp;scheduled caste;police;capital;minister;letter;velagapudiషార్ప్ షూట‌ర్‌గా మంత్రి సుచ‌రిత వ్యూహాత్మ‌క అడుగులు..!షార్ప్ షూట‌ర్‌గా మంత్రి సుచ‌రిత వ్యూహాత్మ‌క అడుగులు..!sucharitha;view;mp;scheduled caste;police;capital;minister;letter;velagapudiWed, 30 Dec 2020 11:30:05 GMTరాజ‌ధాని అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడిలో గ‌డిచిన‌రెండు రోజులుగా జ‌రిగిన వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డం సాధ్యం కాద‌ని అంద‌రూ చేతులు ఎత్తేశారు. ముఖ్యంగా ఎంపీ నందిగం సురేశ్‌పై త‌లెత్తిన తీవ్ర విమ‌ర్శ‌లు.. రాజకీయంగా పెను సంచ‌ల‌నానికి దారితీశాయి. ఓ ఆర్చి నిర్మాణం విషయంలో వెలగపూడి ఎస్సీ కాలనీలో రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ వర్గానికి చెందిన మ‌హిళ‌ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దీని వెనుక ఎంపీ ఉన్నార‌నే వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నానికి దారితీసింది.

సమీప గ్రామాల నుంచి కూడా పెద్దసంఖ్యలో మాల వర్గీయులు వెలగపూడికి చేరుకుని ఆందోళనలో పాల్గొ న్నారు. ఎంపీ సురేశ్‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఇక్క‌డి వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇక‌, ఈ విష యం తెలిసి హోంమంత్రి సుచరిత త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించారు. ఇక్కడ జరిగిన సంఘటన తీవ్ర ఆవేదన కలిగించింద‌న్న ఆమె.. నిరుపేదలకు, ప్రత్యేకించి ఎస్సీలకు రాజధానిలో ఇళ్ళ పట్టాలు ఇవ్వటా నికి వీల్లేదు.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పటానికి వీల్లేదు... రాజధాని విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు న్యాయం జరగటానికి వీల్లేదు... అంటూ ఇలాంటి వాదనలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుడికి మనం విడిపోవటం కావాలి- అని విష‌యాన్ని చాలా చాక‌చ‌క్యంగా ముందుకు తీసుకువెళ్లారు.  

``మనమంతా కలిసి ఉంటేనే మేలు జరుగుతుంది. కలిపి ఉంచే నాయకత్వం ఒక వంక... విడగొట్టాలని చూస్తున్న నాయకుడు మరోవంక కనిపిస్తున్నారు.  మనలో మనం కొట్టుకోవాలని కోరుకుంటున్న వారికి దయచేసి అవకాశం ఇవ్వకండి. మాలలైనా మాదిగలైనా అందరం ఒక్కటే. అందరం కలిసి ఉంటేనే 15–16 శాతం ఉంటాం. విడిపోతే ఎవరికీ విలువ ఉండదు. చెదురుమదురు సంఘటనల్ని ప్రేరేపించాలని కోరుకుంటున్నవారికి అవకాశం ఇవ్వవద్దు. అటువంటి సంఘటనల్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. ఎస్సీల విషయంలో అన్యాయం జరిగితే, నేరం జరిగితే చివరికి పోలీసుల్ని కూడా అరెస్టు చేయించి కేసులు నమోదు చేసిన ప్రభుత్వం మనది`` అనిచెప్ప‌డంతో ప‌రిస్థితి దారికి వ‌చ్చింద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి సుచ‌రిత‌లో కొత్త కోణం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  


'టిఫిన్'కి ఉదయం ఈ ఫుడ్డు తీసుకుంటే అంతే సంగతులు!

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>