MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt-and-cherry6111f8ff-8509-4b0f-aecf-34fbff26f774-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt-and-cherry6111f8ff-8509-4b0f-aecf-34fbff26f774-415x250-IndiaHerald.jpgఅలియా భట్ "ఆర్ఆర్ఆర్" లో ఫిమేల్ లీడ్ గా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు. అలియా భట్ రామ్ చరణ్ భార్య పాత్రలో కనిపిస్తోంది. "సీత" అనే పాత్రకు అలియాను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే అలియా తన పాత్రకు సంబంధించి ఎంతో హోమ్ వర్క్ చేసింది.alia bhatt and cherry;beauty;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;seetha;hyderabad;rajasthan;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;january;konidela production;wife;letter;houseచెర్రీతో అలియా షెడ్యూల్ మళ్ళీ పోస్ట్ పోన్చెర్రీతో అలియా షెడ్యూల్ మళ్ళీ పోస్ట్ పోన్alia bhatt and cherry;beauty;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;seetha;hyderabad;rajasthan;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;january;konidela production;wife;letter;houseWed, 30 Dec 2020 10:00:00 GMTఅలియా భట్, "ఆర్ఆర్ఆర్" లో ఫిమేల్ లీడ్ గా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు. అలియా భట్ , రామ్ చరణ్ భార్య పాత్రలో కనిపిస్తోంది. "సీత" అనే పాత్రకు అలియాను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే అలియా తన పాత్రకు సంబంధించి ఎంతో హోమ్ వర్క్ చేసింది. 


ముఖ్యంగా, డబ్బింగ్ కూడా చెప్పుకునేందుకు వీలుగా డైలాగ్స్ ను కూడా బాగానే బట్టీపట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీ. సౌత్ ఆడియెన్స్ కు కూడా చేరువవ్వాలని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు డైలాగ్స్ ను నేర్చుకుంది. గతేడాది నుంచి తెలుగు భాషపై తన హోమ్ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఓ ట్యూటర్ ను కూడా నియమించుకుంది. 


రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి ఓ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. దాదాపు పదిరోజుల పాటు షూటింగ్ లో పాల్గొంది. ఐతే, చెర్రీ అలాగే అలియాతో కాంబినేషన్ సీన్స్ మాత్రం చిత్రీకరణ జరుపుకోలేదు. అలియా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో చెర్రీ ఇక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. చెర్రీ తన చెల్లెలు నీహారిక కొణిదెల వివాహ వేడుకలలో పాల్గొనడం కోసం రాజస్థాన్ వెళ్లడం జరిగింది. కాబట్టి, ఈ సీన్స్ చిత్రీకరణను జనవరి ఫస్ట్ వీక్ కు వాయిదా వేశాడు రాజమౌళి. 


ఐతే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రామ్ చరణ్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉండటం వల్ల మరో 14 రోజులపాటు షూటింగ్ కు అందుబాటులో ఉండదు. కాబట్టి, ఈ షెడ్యూల్ ను మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనవరి సెకండ్ వీక్ వరకు రామ్ చరణ్ షూట్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. 


మరోవైపు అలియా ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం గురించి చాలా ఎగ్జైట్ అవుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడం తనకు డిఫెరెంట్ ఎక్స్పీరియన్స్ గా ఉంటోందని, ఈ సినిమా కోసమే తెలుగు భాషను నేర్చుకోవడం జరుగుతోందని చెప్పుకొచ్చింది. 




పవన్ పాదయాత్ర చేయాలి... చేస్తారా మరి...?

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>