PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater01f52186-0699-48a4-b3f2-48acfbea6cbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater01f52186-0699-48a4-b3f2-48acfbea6cbd-415x250-IndiaHerald.jpgఆంధ్రా రాష్ట్రానికి ప్రారబ్దం పట్టినట్లుగా ఉంది. లేకపొతే 1915లో ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోవాలని నిర్ణయించిన దగ్గర నుంచి గత వందేళ్ళ ప్రస్థానం కనుక చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం కుదురుగా ఉన్నది లేదు. ఎపుడూ ఆందోళనలే. ఎపుడూ సమస్యలే. 1953 అక్టోబర్ 1న కర్నూల్ రాజధానిగా నాటి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత మూడేళ్ళకు నాటి హైదరాబాద్ స్టేట్ తో కలసి ఉమ్మడి ఏపీగా అవతరించింది. greater;soniagandhi;kranthi;kranti;makar sakranti;hyderabad;andhra pradesh;mp;sankranthi;rayalaseema;chennai;october;letter;reddyరాష్ట్రం మళ్ళీ ముక్కలు...తెర పైకి గ్రేటర్ సీమ ?రాష్ట్రం మళ్ళీ ముక్కలు...తెర పైకి గ్రేటర్ సీమ ?greater;soniagandhi;kranthi;kranti;makar sakranti;hyderabad;andhra pradesh;mp;sankranthi;rayalaseema;chennai;october;letter;reddyWed, 30 Dec 2020 10:00:00 GMTమద్రాస్ స్టేట్ నుంచి విడిపోవాలని నిర్ణయించిన దగ్గర నుంచి గత వందేళ్ళ ప్రస్థానం కనుక చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం కుదురుగా ఉన్నది లేదు. ఎపుడూ ఆందోళనలే. ఎపుడూ సమస్యలే. 1953 అక్టోబర్ 1న కర్నూల్ రాజధానిగా నాటి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత మూడేళ్ళకు నాటి హైదరాబాద్ స్టేట్ తో కలసి ఉమ్మడి ఏపీగా అవతరించింది.

ఈ మధ్య కాలమంతా కలహాల కాపురమే. జై ఆంధ్రా, జై తెలంగాణా ఉద్యమాలతో ఉమ్మడి ఏపీలోనూ నిండు ఆనందం లేకుండా పోయింది. ఇక ఆరేళ్ళ క్రితం ఏపీ తెలంగాణా గా రెండుగా విడిపోయాయి. సరే 1953 నాటి రాష్ట్రంగానైనా ఉందామనుకుంటే ఇపుడు మరో కొత్త చిచ్చు బయలుదేరుతోది.

అదే గ్రేటర్ రాయలసీమ పేరుతో విభజన ఉద్యమానికి కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. రాయలసీమలోని నాలుగు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ కోరుతున్నారు. గ్రేటర్ రయాలసీమ కావాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఇది కొత్త డిమాండ్ కాదని, 2014లో ఉమ్మడి ఏపీ విభజనకు ముందే సోనియా గాంధీకి తాను లేఖ రాశానని ఆయన చెబుతున్నారు. నాడు తన లేఖను పట్టించుకోఎలదని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా 13 జిల్లాల ఏపీతో న్యాయం జరగదని కూడా అంటున్నారు. అందువల్ల తమకు గ్రేటర్ రాయలసీమ కావాల్సిందేనని చెబుతున్నారు. సంక్రాంతి తరువాత గ్రేటర్ రాయలసీమ కోరే వారితో కలసి ఉద్యమ బాట పడతామని చెబుతున్నారు. ఈ తీరు చూస్తూంటే మరో ముక్క ఏపీకి తప్పదా అన్న చర్చ అయితే వస్తోంది  నిజానికి పదమూడు జిల్లాల ఏపీయే ఇపుడు అనేక రకాల సమస్యలు పడుతోంది. ఆర్ధికంగా కూడా కష్టాలు పడుతోంది. ఇందులో కూడా కొత్త రాష్ట్రం వేరేది అంటే ఇక ఏపీ సీన్ ఏంటో అర్ధం కాదు అన్న వారు కూడా ఉన్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుందో.




పవన్ పాదయాత్ర చేయాలి... చేస్తారా మరి...?

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>