Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2020-best-movies-in-tollywood-industry-42394031-c30a-494c-b8f3-7c930e1f5e0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2020-best-movies-in-tollywood-industry-42394031-c30a-494c-b8f3-7c930e1f5e0f-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరం అన్ని రంగాలను తలకిందులుగా చేసింది. అందులో సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఈ ఏడాది థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేసినా చాలా సినిమాలైతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం పైనే రిలీజ్ అయ్యాయి. కాగా ఈ ఏడాదిలో టాలీవుడ్ లో కొన్ని సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయనే చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, హిట్, పలాస 1978 సినిమాలు థియేటర్లలో రిలీజై మాంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదలయ్యాయి.allu arjun;view;mahesh;nithin;chandni;pooja hegde;allu arjun;choudary actor;prince;rashmika mandanna;samantha;suhas;thaman s;tollywood;cinema;ala venkatapuram lo;2020;film industry;industry;hero;success;arjun 1;nithin reddy;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitram2020 లో తెలుగు ఉత్తమ చిత్రం ఏదంటే?2020 లో తెలుగు ఉత్తమ చిత్రం ఏదంటే?allu arjun;view;mahesh;nithin;chandni;pooja hegde;allu arjun;choudary actor;prince;rashmika mandanna;samantha;suhas;thaman s;tollywood;cinema;ala venkatapuram lo;2020;film industry;industry;hero;success;arjun 1;nithin reddy;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramWed, 30 Dec 2020 19:32:33 GMT2020 సంవత్సరం అన్ని రంగాలను తలకిందులుగా చేసింది. అందులో సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఈ ఏడాది థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేసినా చాలా సినిమాలైతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం పైనే రిలీజ్ అయ్యాయి. కాగా ఈ ఏడాదిలో టాలీవుడ్ లో కొన్ని సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయనే చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, హిట్, పలాస 1978 సినిమాలు థియేటర్లలో రిలీజై మాంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదలయ్యాయి. వాటిలో చాలా తక్కువ సినిమాలే ఎక్కువ వ్యూయర్ షిప్ ను దక్కించుకున్నాయి. ఎక్కువ మొత్తంలో చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
అందులో కొన్ని సినిమాలైతే అట్టర్ ప్లాప్ గా పేరును మూటకట్టుకున్నాయి. కాగా ఈ ఏడాదిలో థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ చిత్రాలుగా ఈ క్రింది సినిమాలు సెలక్ట్ అయ్యాయి.  2020 లో ఉత్తమ మూవీస్ కు అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించి ప్రేక్షకులను మెప్పించి అల వైకుంఠపురములో, మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు, యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ, హిట్, సమంత, శర్వానంద్ లు నటించిన  జాను, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్, పలాస 1978 చిత్రాలు ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. ఇందులో ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాతి కానుకగా రిలీజైన అల వైకుంఠపురములో సినిమా ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.

సినిమా ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇందులో కథతో పాటుగా థమన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అల వైకుంఠపురములో సినిమా 2020 ఉత్తమ చిత్రంగా పేరును సంపాదించుకుంది.  ఇక ఈ సంవత్సరం రెండో స్థానంలో ప్రిన్స్ సరిలేరు నీకెవ్వరు నిలిచింది. మహేశ్ కెరీర్ లోనే అత్యధిక రాబడిని వసూలు చేసిన సినిమాగా ఈ మూవీ పేరుగాంచింది. ఓటీటీలో రిలీజైన సినిమాల్లో సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించిన కలర్ ఫోటో మూడవ స్థానాన్ని సంపాదించింది. దీని తర్వాత నితిన్, రష్మిక మందాన జంటగా నటించిన భీష్మ నాలుగో స్థానాన్ని ఆగ్రమించింది. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, పలాస 1978, మిడిల్ క్లాస్ మెలోడీస్, హిట్, జాను సినిమాలు తర్వాతి స్థానాల్లో నిలిచి బెస్ట్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి.  


రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>