MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanth-fans-in-deep-despaire8e7db91-0030-4ff2-80bc-1f764530d093-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanth-fans-in-deep-despaire8e7db91-0030-4ff2-80bc-1f764530d093-415x250-IndiaHerald.jpgఏళ్ల తరబడి నాన్చి.. పార్టీ పెట్టబోతున్నట్టు ఇటీవలే ప్రకటించి.. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి రావడం లేదంటూ.. రజనీకాంత్ చేసిన ప్రకటన.. అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఇన్నాళ్లూ.. తలైవా చెప్పిన దానికి తలూపిన అభిమానులు.. ఇప్పుడు రజినీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆందోళనలకు దిగుతున్నారు. రాజకీయాల్లో రావడం లేదంటూ.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే రజినీ ప్రకటనతో ఎక్కువగా నిరాశచెందింది మాత్రం.. ఆయన అభిమానులే. అయితే, ఇన్నాళ్లూ రజనీకాంత్ చెప్పిందే వేదంగా భావించి పrajinikanth fans in deep despair;rajinikanth;tiru;rajani kanth;police;tamil;december;tamilnadu;letter;partyతీవ్ర నిరాశలో రజినీకాంత్ అభిమానులు..!తీవ్ర నిరాశలో రజినీకాంత్ అభిమానులు..!rajinikanth fans in deep despair;rajinikanth;tiru;rajani kanth;police;tamil;december;tamilnadu;letter;partyWed, 30 Dec 2020 22:00:00 GMTపార్టీ పెట్టబోతున్నట్టు ఇటీవలే ప్రకటించి.. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి రావడం లేదంటూ.. రజనీకాంత్ చేసిన ప్రకటన.. అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఇన్నాళ్లూ.. తలైవా చెప్పిన దానికి తలూపిన అభిమానులు.. ఇప్పుడు రజినీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆందోళనలకు దిగుతున్నారు.

రాజకీయాల్లో రావడం లేదంటూ.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే రజినీ ప్రకటనతో ఎక్కువగా నిరాశచెందింది మాత్రం.. ఆయన అభిమానులే. అయితే, ఇన్నాళ్లూ రజనీకాంత్ చెప్పిందే వేదంగా భావించి పూజించిన అభిమానులు తాజాగా సూపర్ స్టార్‌పై తిరుగుబాటు చేస్తున్నారు.

ఈ నెల 31న పార్టీని ప్రకటిస్తానని చెప్పి ఉర్రూతలూగించిన రజనీకాంత్‌... నిన్న పార్టీ పెట్టడం లేదంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. తలైవా నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రజకాంత్ నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడులో అందోళనకు దిగారు.

రజనీ రాజకీయాల్లోకి వస్తారని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని,  తలైవా  తాజా నిర్ణయం తమను ఎంతగానో బాధించిందని చెబుతున్నారు. రజనీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు అభిమానులు.

సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానంటూ ఇన్నాళ్లూ చెప్పిన రజనీ.. అనారోగ్యం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు మంగళవారం ప్రకటించారు. అర్థం చేసుకోవాలంటూ అభిమానులకు మూడు పేజీల లేఖ రాశారు. అయితే, రజనీకాంత్‌ నిర్ణయం కారణంగా.. అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో ఆయన ఇంటి దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొత్తానికి  రజినీకాంత్ రాజకీయ ప్రస్థానం ఆరంభించకుండానే ఎండ్ కార్డ్ పడటంపై అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే చివరికి ఇలా చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆశలపై తలైవా నీళ్లు చల్లారని లోలోన మదనపడిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారు. డిసెంబర్ 31కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తే ఇలా అయిపోయింది ఏంటి అంటూ తలలు పట్టుకుంటున్నారు. రజినీ కాంత్ అభిమానుల కోసం రాసిన లేఖ వారిలో నిరుత్సాహాన్ని నింపింది.








భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?

అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>