EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rajanikanth-iswarya-soundarya-tamilnadu-apollo2744e282-4f22-406c-a6b6-71439c641df1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rajanikanth-iswarya-soundarya-tamilnadu-apollo2744e282-4f22-406c-a6b6-71439c641df1-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతోనే తాను చేస్తున్న సినిమా అన్నాతై షూటింగ్ ను పెట్టుకున్నారు. సినిమాను తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతోనే రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారట. ఇంతపెద్ద వయస్సులో రోజుకు 14 గంటలు పనిచేయటం అంటే మామూలు విషయం కాదు. పైగా ఫుల్లుగా అనారోగ్యంతో ఉన్న రజనీపై దీని ప్రభావం బాగా పడింది. దాంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో నాలుగు రోజులు ఐసీయులో ఉండాల్సొచ్చింది. డిశ్చార్జయి చెన్నైకి వెళ్ళిన దగ్గర నుండి ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఐశ్యర్య, సౌందర్యలు రజనీకి ఫుల్లుగా క్లాసు పీకినట్లు సమాrajanikanth iswarya soundarya tamilnadu apollo;rajinikanth;hyderabad;cinema;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?rajanikanth iswarya soundarya tamilnadu apollo;rajinikanth;hyderabad;cinema;partyWed, 30 Dec 2020 03:00:00 GMTమొదటినుండి అనుమానిస్తున్నట్లే జరిగింది. తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తలైవా రజనీకాంత్ హఠాత్తుగా ఓ ప్రకటన చేశారు. అభిమానుల, ప్రజలను ఉద్దేశించి రాసిన మూడుపేజీల లేఖను మంగళవారం ఉదయం విడుదల చేశారు. అందులో తన అనారోగ్యం కారణంగా రాజకీయపార్టీ ఏర్పాటు నుండి తప్పుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించేశారు. పొలిటికల్ ఎంట్రీపై నిరసపరచినందుకు అభిమానులు క్షమించాలంటు రజనీ కోరారు. రజనీ నుండి ఇలాంటిదేదో జరుగుతుందని మొదటి నుండి చాలామంది ఊహిస్తున్నదే. ఎందుకంటే దాదాపు 70 ఏళ్ళు ఉన్న రజనికాంత్ ను అనారోగ్యం పట్టి పీడిస్తోంది. ఈమధ్యనే కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ కూడా చేయించుకున్నారు. అయినా ఆరోగ్య సమస్యలు తలెత్తుతునే ఉన్నాయి. వీటిన్నింటికి అదనంగా హై బీపీ బాగా ఇబ్బంది పెడుతోంది.




రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతోనే తాను చేస్తున్న సినిమా అన్నాతై షూటింగ్ ను పెట్టుకున్నారు. సినిమాను తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతోనే రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారట. ఇంతపెద్ద వయస్సులో రోజుకు 14 గంటలు పనిచేయటం అంటే మామూలు విషయం కాదు. పైగా ఫుల్లుగా అనారోగ్యంతో ఉన్న రజనీపై దీని ప్రభావం బాగా పడింది. దాంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో నాలుగు రోజులు ఐసీయులో ఉండాల్సొచ్చింది. డిశ్చార్జయి చెన్నైకి వెళ్ళిన దగ్గర నుండి ఇంట్లో ఇద్దరు కూతుర్లు ఐశ్యర్య, సౌందర్యలు రజనీకి ఫుల్లుగా క్లాసు పీకినట్లు సమాచారం. అనారోగ్యంతో, ఈ వయస్సులో రాజకీయపార్టీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందంటు గట్టిగా తగులుకున్నారట. పైగా ఎన్నికలు మే నెలలో జరగబోతున్నాయి. అంటే పార్టీ పెట్టిన దగ్గర నుండి 24 గంటలూ పనిచేసినా ప్రజలపై ఎంత  ప్రభావం చూపుతుందో తెలీదు. ఇదే విషయాన్ని కూతుర్లిద్దరు రజనీతో గట్టిగా చెప్పారట.




కూతుర్లతో పాటు మరికొందరు కూడా ఇచ్చిన సలహా కారణంగా రాజకీయపార్టీ ఏర్పాటు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. రాజకీయపార్టీ పెట్టడానికి తన ఆరోగ్యం సహకరించటం లేదని రజనీ లేఖలో చెప్పారు. ఇపుడు రజనీ చెప్పిన కారణాలనే జనాలు ఎప్పటి నుండో ఊహిస్తున్నదే. ఎందుకంటే ఇపుడు పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావటానికి రజనీకి వయస్సయిపోయిందని అందరికీ తెలుసు. పార్టీ పెట్టడం, రాజకీయాల్లోకి రావటం ఏదో పదేళ్ళ క్రితమే చేసుంటే పరిస్దితులు వేరుగా ఉండేది.  కానీ వయస్సయిపోయిన తర్వాత, తీవ్ర అనారోగ్యాలతో ఉన్న సమయంలో అదికూడా ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు రాజకీయ పార్టీ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. సరే మొత్తం మీద చాలామంది అనుకుంటున్నట్లే రజనీ రాజకీయాల నుండి తప్పుకుని మంచి పనేచేశారు.




రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>