PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/perni-nani5e7a2bb0-5e39-4347-b6eb-f69eff09cd1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/perni-nani5e7a2bb0-5e39-4347-b6eb-f69eff09cd1f-415x250-IndiaHerald.jpgపవన్‌ కళ్యాణ్‌ ఆటలో అరటిపండు.. తన ఇంటికొస్తే పచ్చడి అన్నమే.. అదే చంద్రబాబు ఇంటికెళ్తే సూట్‌కేసు అంటూ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తప్ప చిడతల నాయుడు ఎవరికీ అండగా నిలబడలేదని.. సహస్రకోటి నాయుడుల్లో ఆయనొక బోడి నాయుడు అన్నారు. నకిలీ వకీల్‌ సాబ్‌.. మోదీ సాబ్‌కు చెప్పండి.. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇమ్మని అంటూ విరుచుకుపడ్డారు. సినిమాలు మానేయమని చిడతల నాయుడికి ఎవరూ చెప్పలేదని.. వందల కోట్ల సంపాదనను వదులుకుని వస్తున్నానని చెప్పింది చిడతల నాయుడు కాదా అని మండిపడ్డారుperni nani;pawan;cbn;nani;kalyan;kodali nani;andhra pradesh;narendra modi;janasena;telugu;perni nani;assembly;minister;janasena party;mantraపవన్ కళ్యాణ్ 'ఆటలో అరటిపండు' - మంత్రి పేర్ని నాని!పవన్ కళ్యాణ్ 'ఆటలో అరటిపండు' - మంత్రి పేర్ని నాని!perni nani;pawan;cbn;nani;kalyan;kodali nani;andhra pradesh;narendra modi;janasena;telugu;perni nani;assembly;minister;janasena party;mantraWed, 30 Dec 2020 09:50:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. పవన్ కళ్యాణ్ చేసిన బోడిలింగం, ముగ్గురు నానీలు, అసెంబ్లీ ముట్టడి వంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ కి వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ వకీల్ ఎప్పుడయ్యారని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో పవన్ దిట్టని.. ఆయనంత గొప్పగా ఎవరూ చిడతలు కొట్టలేరన్నారు.




హైటెక్స్‌ లో మీటింగ్ పెట్టి చిడతలు ఎవరికి కొట్టారు.. ముందు మోడీకి, తర్వాత చంద్రబాబుకి చిడతలు కొట్టారని సెటైర్లు పేల్చారు. కొడాలి నాని అంటే పవన్‌కు భయమని.. అందుకే ఆయన పేరు ఎత్తలేకపోయారన్నారు.. తానంటే పిచ్చి కాపుని అన్నారు. ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు మంత్రో తెలియదని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబుకు ఓటేయమన్న పవన్ కళ్యాణ్.. పంట నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇప్పించారని నాని ప్రశ్నించారు. అలాగే ఆ సమయంలో ఏ అసెంబ్లీని ముట్టడించారని ప్రశ్నించారు. పవన్, ఆయన పార్టనర్ కలిసి ఇచ్చిన దానికంటే తమ ప్రభుత్వం 50 శాతం ఎక్కువే ఇస్తోందన్నారు. పవన్‌ వకీల్‌ అన్నది ఎంత నిజమో.. రైతుల పట్ల ఆయన చేసిన పోరాటం అంతే నిజం అన్నారు.
 


పవన్‌ కళ్యాణ్‌ ఆటలో అరటిపండు.. తన ఇంటికొస్తే పచ్చడి అన్నమే.. అదే చంద్రబాబు ఇంటికెళ్తే సూట్‌కేసు అంటూ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తప్ప చిడతల నాయుడు ఎవరికీ అండగా నిలబడలేదని.. సహస్రకోటి నాయుడుల్లో ఆయనొక బోడి నాయుడు అన్నారు. నకిలీ వకీల్‌ సాబ్‌.. మోదీ సాబ్‌కు చెప్పండి.. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇమ్మని అంటూ విరుచుకుపడ్డారు. సినిమాలు మానేయమని చిడతల నాయుడికి ఎవరూ చెప్పలేదని.. వందల కోట్ల సంపాదనను వదులుకుని వస్తున్నానని చెప్పింది చిడతల నాయుడు కాదా అని మండిపడ్డారు మంత్రి పేర్ని నాని.


'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>