PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyane337eacc-0c88-45f3-a73c-c26ac478676f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyane337eacc-0c88-45f3-a73c-c26ac478676f-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మరోసారి సంచలనం రేపారు. గత కొన్నిరోజులుగా సినిమాల్లో బిజీగా ఉన్న పవన్...ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నివర్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇక తుఫాన్ వచ్చిన సమయంలోనే పవన్ పలు జిల్లాల్లో పర్యటించి రైతులని పరామర్శించే కార్యక్రమం చేశారు. pawan kalyan;pawan;nani;kodali nani;pawan kalyan;amarnath cave temple;krishna river;andhra pradesh;government;perni nani;ycp;gajuwaka;mantraనానీలకు కోపం వచ్చింది...పవన్ టార్గెట్ అదేనా?నానీలకు కోపం వచ్చింది...పవన్ టార్గెట్ అదేనా?pawan kalyan;pawan;nani;kodali nani;pawan kalyan;amarnath cave temple;krishna river;andhra pradesh;government;perni nani;ycp;gajuwaka;mantraWed, 30 Dec 2020 00:00:00 GMTఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మరోసారి సంచలనం రేపారు. గత కొన్నిరోజులుగా సినిమాల్లో బిజీగా ఉన్న పవన్...ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నివర్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.  ఇక తుఫాన్ వచ్చిన సమయంలోనే పవన్ పలు జిల్లాల్లో పర్యటించి రైతులని పరామర్శించే కార్యక్రమం చేశారు.

ఇక తాజాగా పవన్, ప్రభుత్వం నుంచి తుఫాన్ సాయం అందలేదని చెబుతూ, ప్రతి కలెక్టరేట్‌లో వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పర్యటించి, మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో నానీలు ఎక్కువైపోయారని, అలాగే మంత్రులు పేర్లు తెలియనట్లు మాట్లాడారు. శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్లు విమర్శలు గుప్పించారు.

అయితే పవన్ ఈ స్థాయిలో ఎప్పుడు విమర్శలు చేయలేదు. ఇలా వ్యక్తిగతంగా మంత్రులని టార్గెట్ చేసి మాట్లాడలేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని, పేర్ని నానిలు కీలకంగా ఉన్నారు. అందుకే వారిద్దరిని టార్గెట్ చేసుకుని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. మామూలుగానే ఈ ఇద్దరు మంత్రులు ఫైర్ బ్రాండ్లు. ఇక ఇలా తమపై విమర్శలు చేస్తే ఊరుకుంటారా వారు కూడా రివర్స్‌లో పవన్‌కు కౌంటర్లు ఇచ్చారు.

ఇద్దరు నానీలు ఓ రేంజ్‌లో పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. బోడి లింగం ఎవరో గాజువాక, భీమవరం ప్రజలని అడిగితే తెలుస్తుందని కొడాలి నాని విమర్శించారు. మెడ మీద మట్టి నలుపుకుంటూ, చిడతలు వాయిస్తూ ఉంటాడని పవన్‌పై పేర్ని నాని మండిపడ్డారు. అయితే ఏపీలో జరుగుతున్న ఈ వార్‌ని  చూస్తే పవన్ కల్యాణ్ కావాలనే మంత్రులని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. ఇళ్ల పట్టాల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది.




రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>