PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/number-of-new-corona-cases-in-ap76e15edc-9c26-41c3-a957-4093c9f4424e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/number-of-new-corona-cases-in-ap76e15edc-9c26-41c3-a957-4093c9f4424e-415x250-IndiaHerald.jpgభార‌త్‌వైపు కొత్త‌ర‌కం క‌రోనా స్ట్రెయిన్ వైర‌స్ దూసుకువ‌స్తోంది. క్ర‌మంగా కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి కేవ‌లం ఆరు కేసుల్ని మాత్ర‌మే అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం తాజాగా.. మరో 14 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించింది. దీంతో దేశంలో కరోనా కొత్త రకం కేసుల సంఖ్య 20కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు మంగళవారమే సంకేతాలిచ్చాయి. బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసొలేషన్‌లో ఉంచcorona;telangana;central governmentభార‌త్ వైపు దూసుకొస్తున్న‌ కొత్త‌ర‌కం క‌రోనా..దేశంలో కేసులు పెరుగుతున్నాయిగా..భార‌త్ వైపు దూసుకొస్తున్న‌ కొత్త‌ర‌కం క‌రోనా..దేశంలో కేసులు పెరుగుతున్నాయిగా..corona;telangana;central governmentWed, 30 Dec 2020 10:20:01 GMTకేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు మంగళవారమే సంకేతాలిచ్చాయి.
బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసొలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి, క్వారంటైన్‌కు పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించింది.


మ‌రోవైపు దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న‌టి కంటే ఇవాళ 25 శాతం పెరిగిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇవాళ విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం.. కొత్త‌గా 20,550 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. 286 మంది చ‌నిపోయారు. 26,572 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్ల‌కు చేరుకోగా, క‌రోనాతో 1.48 ల‌క్ష‌ల మంది మృతి చెందారు. కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య ఇండియాలో 20కి చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. తాజాగా 14 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఆరుగురికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్రం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 20 పాజిటివ్ కేసుల్లో ఢిల్లీలో 8, బెంగ‌ళూరులో ఏడు కేసుల‌ను గుర్తించారు.


ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,590 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 474 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,85,939కి చేరింది. మరోవైపు కరోనాతో తాజాగా ముగ్గురు మృతి చెందడంతో.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,538కి పెరిగింది. తాజాగా 592 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,78,523గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,878 క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 3,735 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో  102 కరోనా కేసులు నమోదయ్యాయి.





ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>