Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/man-drinks-lots-of-water-in-the-fear-of-corona-and-admits-in-hospital05973e4d-e70b-45b9-af8b-c15c470f7786-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/man-drinks-lots-of-water-in-the-fear-of-corona-and-admits-in-hospital05973e4d-e70b-45b9-af8b-c15c470f7786-415x250-IndiaHerald.jpgనీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది. ఈ మాట చిన్నప్పటినుంచి వింటూనే ఉంటాం. డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు, ఇంట్లో తల్లిదండ్రులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని మనకు చెబుతూ ఉంటారు. అయితే నీరు తాగడం మంచిదే అయినా.. అతిగా తాగితే మాత్రం అవస్థలు పడాల్సిందేనని నిరూపించే ఘటన ఇంగ్లాండ్‌లో..corona;london;doctor;husband;wife;vకరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...corona;london;doctor;husband;wife;vWed, 30 Dec 2020 19:52:00 GMTఇంటర్నెట్ డెస్క్: నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది. ఈ మాట చిన్నప్పటినుంచి వింటూనే ఉంటాం. డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు, ఇంట్లో తల్లిదండ్రులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని మనకు చెబుతూ ఉంటారు. అయితే నీరు తాగడం మంచిదే అయినా.. అతిగా తాగితే మాత్రం అవస్థలు పడాల్సిందేనని నిరూపించే ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది. అందులోనూ కరోనా భయం మనిషికి ఏ స్థాయిలో ఆందోళణ కలిగిస్తుందో కూడా ఈ ఘటన తెలియజేస్తుంది.

ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో పాచ్‌వే ప్రాంతంలో ల్యూక్ విలియమ్సన్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అయితే లండన్ వ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో విలియమ్సన్ ఆందోళన చెందాడు. తనకు కూడా కొత్త కరోనా సోకిందేమోనన్న భయంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకున్నాడు. అయితే కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే భయపడాల్సిందేమీ లేదని, త్వరలోనే కోలుకుంటారని చెప్పిన డాక్టర్. రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించాడు. కనీసం రోజుకు 2లీటర్లయినా నీరు తాగాలని చెప్పాడు. ఈ సూచనే విలియమ్సన్ ప్రాణాల మీదకు తెచ్చింది.

అతి త్వరగా కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో విలియమ్సన్ రోజుకు ఏకంగా 5 లీటర్ల చొప్పున నీరు తాగడం మొదలెట్టాడు. అయితే అధికంగా నీరు తాగడం వల్ల శరీరంలోని  సోడియం లెవెల్స్ దారుణంగా తగ్గిపోయి అనారోగ్యంపాలయ్యాడు. బాత్‌రూంకు వెళ్లి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన భార్య లారా అప్రమత్తమై ఆసుపత్రికి తరలించింది. అయితే అసలే కరోనా పేషెంట్.. ఇప్పుడు సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయి. డాక్టర్లు కూడా అతడు బతకడంపై అనుమానం వ్యక్తం చేశారట. అయితే 3 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. చివరకు విలియమ్సన్ ఎలాగోలా కోలుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి భార్యాబిడ్డలతో హాయిగా గడుపుతున్నారు.

తన భర్తను కాపాడినందుకు డాక్టర్లకు విలియమ్సన్ భార్య లారా ధన్యవాదాలు చెప్పారు. వారి గొప్పతనం వల్లే తన భర్త బతికాడని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ప్రతిదీ మితంగా ఉండాలి. ఎక్కువైతే ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకే ఏదీ మితిమీరకూడదని పెద్దలు చెబుతుంటారు.  


పవర్ స్టార్ ఫ్యాన్సా? మజాకా?

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>