PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-thing-about-the-construction-of-rama-m1f86b264-ab9d-4042-b25f-058dd81642ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/interesting-thing-about-the-construction-of-rama-m1f86b264-ab9d-4042-b25f-058dd81642ce-415x250-IndiaHerald.jpgఆలయ పునాదులు, నమూనాలపై ఇంజనీర్లు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు... శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరీజీ మహరాజ్‌ వెల్లడించారు. రామ మందిర ప్రధాన ఆలయ నిర్మాణానికే దాదాపు 3 వందల నుంచి 4 వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు. ఇక మొత్తం ఆలయ ప్రాంగణంతో కలిపితే ఈ ఖర్చు 11 వందల కోట్ల రూపాయలు దాటుతుందని చెబుతున్నారు.ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా వంద కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని వెల్లడించారు.interesting thing about the construction of rama m;govi;mumbai;delhi;ayodhyaరామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!interesting thing about the construction of rama m;govi;mumbai;delhi;ayodhyaWed, 30 Dec 2020 18:00:00 GMTఅయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఇటీవలే మొదలయ్యాయి. అయితే ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న విషయంపై... ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదు.రామమందిర నిర్మణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. దాదాపు 1100కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కతేల్చింది. అంతేకాదు ఆలయ నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆలయ పునాదులు, నమూనాలపై ఇంజనీర్లు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు... శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరీజీ మహరాజ్‌ వెల్లడించారు. రామ మందిర ప్రధాన ఆలయ నిర్మాణానికే దాదాపు 3 వందల నుంచి 4 వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు. ఇక మొత్తం ఆలయ ప్రాంగణంతో కలిపితే ఈ ఖర్చు 11 వందల కోట్ల రూపాయలు దాటుతుందని చెబుతున్నారు.ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా వంద కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని వెల్లడించారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ట్రస్టీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. ఇందులో ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాస్‌, గుహవాటి, సీబీఆర్‌ఐ, రూర్కీతో పాటు ఎల్‌అండ్‌టీ, టాటా గ్రూప్‌నకు చెందిన ఇంజనీర్లు పనిచేస్తున్నారని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ తెలిపింది.

కేవలం స్వదేశీ నిధులతోనే రామమందిర నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఇప్పటికే స్పష్టంచేసింది.వీటిని సాధారణ పౌరుల నుంచి మాత్రమే సేకరిస్తామని తెలిపింది. ఇందుకోసం పది, వంద , వెయ్యి  రూపాయల విలువగల కూపన్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.వీటి ద్వారా మాత్రమే విరాళాలను స్వీకరిస్తామని స్పష్టంచేసింది. ప్రస్తుతం, 10 రూపాయల విలువ గల 4 కోట్ల కూపన్లు, 100 రూపాయల విలువైన 8 కోట్ల కూపన్లు, 1000 రూపాయల విలువైన 12లక్షల కూపన్లను ప్రింట్‌ చేసినట్లు రామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రకటించింది. మొత్తానికి అయోధ్య రామమందిర నిర్మాణం భక్తులకు ఆసక్తి కలిగిస్తోంది.




యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

కంటి మీద కునుకులేకుండా చేస్తోంది..!

ఐదో సినిమాకు అఖిల్ ఓకే.. హీరోయిన్ ఎవరంటే..!

బుల్లిపిట్ట: గూగుల్ మంత్లీ పాస్.. దేనికోసమంటే..

ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..

2023లో అధికారం మాదే.. అప్పుడు చెబుతాం: మాజీ మంత్రి దేవినేని ఉమా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>