PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuram-raju1ae6df89-9338-494c-88a8-f6b5f7c42ca3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuram-raju1ae6df89-9338-494c-88a8-f6b5f7c42ca3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పదే పదే దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు అందరూ కూడా ఈ ఘటనలపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక విపక్షాలు హిందుత్వ వాదులు అయితే ప్రతీ దానికి సిఎం వైఎస్ జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. సిఎం జగన్ ఈ దాడుల వెనుక ఉన్నారని వైసీపీని కొందరు టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం సంచలనం అయింది. ఏపీలో రాజకీయంగా బిజెపి బలపడాలని భావిస్తున్న తరుణంలో ఈ దాడులు వివాదాస్పదంగా మారాయి.raghurama krishnam raju,ycp,jagan,modi,bjp,ap;krishna;raghu;ramakrishna;ramu;bharatiya janata party;jagan;andhra pradesh;mp;prime minister;minister;letter;central government;ycp;hindus;yevaru;narendraప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదుప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదుraghurama krishnam raju,ycp,jagan,modi,bjp,ap;krishna;raghu;ramakrishna;ramu;bharatiya janata party;jagan;andhra pradesh;mp;prime minister;minister;letter;central government;ycp;hindus;yevaru;narendraWed, 30 Dec 2020 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో పదే పదే దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు అందరూ కూడా ఈ ఘటనలపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక విపక్షాలు హిందుత్వ వాదులు అయితే ప్రతీ దానికి సిఎం వైఎస్ జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. సిఎం జగన్ ఈ దాడుల వెనుక ఉన్నారని వైసీపీని కొందరు టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం సంచలనం అయింది. ఏపీలో రాజకీయంగా బిజెపి బలపడాలని భావిస్తున్న తరుణంలో ఈ దాడులు వివాదాస్పదంగా మారాయి.

ఇక తాజాగా ఈ ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీరియస్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపిలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి హిందూ దేవాలయాలు,  రధాలపై దాడులు పెరిగాయి అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు వంద ఆలయాలపై దాడులు చేసారు ఆయన లేఖలో ప్రస్తావించారు. తాజాగా ఒక ఆలయంలో కొందరు దుండగులు  రాముని విగ్రహం తల నరికి తమతో  తీసుకు వెళ్ళారు అని ఘటనను వివరించారు.

కరోనా నిబంధనలు పేరుతో హిందువులు ఎవరు రోడ్డు పైకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుంది అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో సియం కార్యక్రమాలకు మాత్రం జనాన్ని అనుమతిస్తున్నారు అని విమర్శించారు. ఈ దాడులకు సంబంధించి ఒకరిద్దరిని మినహా మరెవ్వరి పైనా చర్యలు లేవు అని ఆరోపణలు చేసారు. ఈ దాడులపై కేంద్రం ఒక కమిటీని నియమించాలని కోరుతున్నా అని, ఈ దాడులకు సంబంధించి ఎవరున్నా,  వారి హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలి అని ఆయన లేఖలో డిమాండ్ చేసారు.


పశ్చిమ గోదావరిలో పులి జాడలు . భయపడుతున్న ప్రజలు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..

2023లో అధికారం మాదే.. అప్పుడు చెబుతాం: మాజీ మంత్రి దేవినేని ఉమా

యువరాజ్ రీ ఎంట్రీపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఇప్పుడేం చేయాలి..?

వకీల్ సాబ్ ఎప్పుడొస్తున్నాడంటే..

సిబిఐ అంటున్న పవన్ కళ్యాణ్

తెలంగాణ కాంగ్రెస్ పక్కా ప్లాన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>