MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award5b021b94-dd3c-4525-a110-0466ba9a1d36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award5b021b94-dd3c-4525-a110-0466ba9a1d36-415x250-IndiaHerald.jpg'హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డు సోను సూద్ కు ఇవ్వబోతున్నారు. డిసెంబరు 30 న ఈ అవార్డును సోను అందుకోనున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే చేత ఈ అవార్డును పొందపోతున్నారట సోను సూద్. అటు పేరు ప్రతిష్టలు, ఇటు ప్రతిష్టాత్మక పురస్కారాలనూ అందుకుంటున్నారుsonu soodh acheives an other award;sonu sood;norway;bollywood;2020;heroమరో అవార్డు అందుకోనున్న సోనూసూద్...!మరో అవార్డు అందుకోనున్న సోనూసూద్...!sonu soodh acheives an other award;sonu sood;norway;bollywood;2020;heroTue, 29 Dec 2020 14:00:00 GMT2020 లో ప్రపంచంలో టాప్‌ 50 ఆసియన్‌ సెలబ్రిటీల’ జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన ప్రదర్శించిన దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి అని కోరిన ప్రతి ఒక్కరికీ సాయం అందించడంలో ఏమాత్రం వెనకాడలేదు సోను.

సినీ ఫీల్డ్ లో తను సంపాదించుకున్న ఆస్తులను మొత్తం నిరుపేదలకు పంచి పెట్టి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శక్తికి మించి సహాయ సహకారాలు అందించిన సోను తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి పేదలకు సాయం చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాకుండా తెలిసినవారిని మరియు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ను సంప్రదించి కోవిడ్ కరువు కాలంలో అభాగ్యులకు అండగా నిలవాలని కోరారు. రీల్ లైఫ్ లో విలన్ గా కనిపించిన ఈ నటుడు రియల్ లైఫ్ లో నిజమైన హీరోగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు ఆసరాగా నిలబడ్డ సోను సూద్ కు ఎన్నో గౌరవ పురస్కారాలు దక్కాయి.

అయితే ఇప్పుడు మరో అవార్డు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా దక్కబోతోంది. 'హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డు సోను సూద్ కు ఇవ్వబోతున్నారు. డిసెంబరు 30 న ఈ అవార్డును సోను అందుకోనున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే చేత ఈ అవార్డును పొందపోతున్నారట సోను సూద్. అటు పేరు ప్రతిష్టలు, ఇటు ప్రతిష్టాత్మక పురస్కారాలనూ అందుకుంటున్నారు రియల్ హీరో సోనుసూద్. ఈ విధంగా సోనూసూద్ ప్రజలకు చేస్తున్న సేవలకు ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.. దేశంలో ఉన్న సంపన్నులు కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సహాయ సహకారాలు అందిస్తే ఆయన చేసిన సేవలకు అర్ధం ఉంటుంది.


వేగం పెంచేస్తున్న యంగ్ రెబల్ స్టార్..!

బుల్లిపిట్ట: యాపిల్‌ను విమర్శించిన చైనా కంపెనీ.. ఇప్పుడు చేసే పనేంటి?

కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇలా చేయరు: చంద్రబాబు

రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

రియల్ లైఫ్ 'కాంచన'.. ఆ ఒక్కటే తేడా..

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>