MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaee74a4eb-5261-4b07-89f9-f318bb491836-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaee74a4eb-5261-4b07-89f9-f318bb491836-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ #BB3 తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా ఉండగానే బాలయ్య మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. balakrishna;business;balakrishna;b gopal;boyapati srinu;poorna;puri jagannadh;siddhartha;srivas;ram madhav;cinema;amazon;paisa vasool;sai madhav burra;blockbuster hit;director;nandamuri taraka rama raoకొత్త సంవత్సరంలో బిజీ కానున్న బాలయ్య .. ఎందుకో తెలుసాకొత్త సంవత్సరంలో బిజీ కానున్న బాలయ్య .. ఎందుకో తెలుసాbalakrishna;business;balakrishna;b gopal;boyapati srinu;poorna;puri jagannadh;siddhartha;srivas;ram madhav;cinema;amazon;paisa vasool;sai madhav burra;blockbuster hit;director;nandamuri taraka rama raoTue, 29 Dec 2020 15:17:31 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా ఉండగానే బాలయ్య  మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  తాజాగా బాలయ్య చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడట.  ఇక ఆ సినిమాతో పాటు బాలయ్య, దర్శకుడు శ్రీవాస్ సినిమాని కూడా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ఇక తన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బి గోపాల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాడు బాలయ్య.  సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేశాడట... ఇక వీటికి తోడు పూరి జగన్నాధ్ బాలయ్య కలయికలో గతంలో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. లాక్ డౌన్ లో పూరి బాలయ్య కోసం ఒక కథని రాశారట  దానిని  బాలయ్యకి  వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక ప్రస్తుతం  బోయపాటి తో  బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక బాలయ్య చేస్తోన్న ప్రస్తుత సినిమా విషయానికి వస్తే...  డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ బీబీ3 మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.  అది అలా ఉంటే బాలయ్య సినిమాలో ప్రముఖ పాత్ర పోషించే విలన్ పాత్ర ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. బాలయ్య బోయపాటి సినిమాలో విలన్ గా కొందరి పేర్లు బయటికి వినిపించిన ఇంకా ఎవరు ఖరారు కాలేదు .. దీంతో చివరకు బోయపాటికి విలన్‌గా ఎవరు దొరుకుతారో చూడాలి... ఇక  బాలకృష్ణ సినిమాలో  హీరోయిన్ల కూడా ఎంపిక అయ్యారు ..  ఈ క్రమంలో  సయేషా సైగల్ పేరును ప్రకటించింది చిత్రబృందం. మరో హీరోయిన్‌గా పూర్ణ ఖాయం అయ్యింది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా  మొదలైంది.  అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. 


జగనన్న క్యాంటిన్ పెట్టొచ్చు... జగన్ కు బిజెపి సలహా

అన్ని సేవలూ ఒకే యాప్ ద్వారా..!

పీకే వరకు వెళ్ళిన లోకేష్ బాబు

ఈ ఏపీ మంత్రి తాగుబోతు... పుస్తకం రాస్తున్న టీడీపీ

స్థానిక సంస్థ‌ల‌పై హైకోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న‌.. నిమ్మ‌గ‌డ్డ‌ను వెళ్లి క‌లవాలంటూ అధికారుల‌కు ఆదేశాలు..

10 రూపాయల కోసం కక్కుర్తి.. చివరికి 50 వేలు మాయం..?

బుల్లిపిట్ట: యాపిల్‌ను విమర్శించిన చైనా కంపెనీ.. ఇప్పుడు చేసే పనేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>