PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-cant-find-the-right-leader-for-tdp-there-19f5205d-7655-4d73-8aa0-4a231b23309f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-cant-find-the-right-leader-for-tdp-there-19f5205d-7655-4d73-8aa0-4a231b23309f-415x250-IndiaHerald.jpgటీడీపీ ఇన్‌చార్జ్‌గా బండారు కొన‌సాగుతున్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇక ఆయ‌న వార‌సుడు పైనే బంగారు ఆశ‌లు ఉన్నాయి. ఇక ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల విష‌యంలోనూ చంద్ర‌బాబు ఆయ‌న‌కు పెద్ద బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డంపై కూడా బండారు కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బండారు గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు పెద్ద‌గా తెలియ‌దు. ఈ త‌రం పాలిటిక్స్‌కు అనుకూలంగా బండారు అప్‌డేట్ కాక‌పోవ‌డం కూడా మైన‌స్tdp;tiru;bandara;mp;vishakapatnam;mla;cheque;letter;tdp;ycp;pendurthi;pinnamaneni babji;reddy;partyటీడీపీలో ఆ సీనియ‌ర్ క‌థ ముగిసింది... అల్లుడి రిఫరెన్సా..!టీడీపీలో ఆ సీనియ‌ర్ క‌థ ముగిసింది... అల్లుడి రిఫరెన్సా..!tdp;tiru;bandara;mp;vishakapatnam;mla;cheque;letter;tdp;ycp;pendurthi;pinnamaneni babji;reddy;partyTue, 29 Dec 2020 09:51:49 GMTవిశాఖ జిల్లాలో ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేస్తోన్న సీనియ‌ర్ నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి పొలిటిక‌ల్ కెరీర్ దాదాపు ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి న‌మ్మ‌కంగా టీడీపీలో ఉంటూ రాజ‌కీయం చేస్తోన్న ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి త‌న ప‌ట్టు నిలుపుకున్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు వ‌స్తుందా ?  రాదా ? అన్న డౌట్ ఉన్నా చివ‌ర‌కు ఏదోలా సీటు వ‌చ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న కార‌ణంతో సీటు ఇస్తే ఆయ‌న ఏకంగా 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ప్ర‌స్తుతం పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ యంగ్ ఎమ్మెల్యే అన్న‌పురెడ్డి అదీప్‌రాజ్ దూసుకు పోతున్నారు.

ఇక ప్ర‌స్తుతానికి పెందుర్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా బండారు కొన‌సాగుతున్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇక ఆయ‌న వార‌సుడు పైనే బంగారు ఆశ‌లు ఉన్నాయి. ఇక ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వుల విష‌యంలోనూ చంద్ర‌బాబు ఆయ‌న‌కు పెద్ద బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డంపై కూడా బండారు కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బండారు గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు పెద్ద‌గా తెలియ‌దు. ఈ త‌రం పాలిటిక్స్‌కు అనుకూలంగా బండారు అప్‌డేట్ కాక‌పోవ‌డం కూడా మైన‌స్‌.

ప్ర‌స్తుతం బండారు అల్లుడు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహనరావు టీడీపీలో తిరుగులేని యువ‌నేత‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బండారు త‌న అల్లుడు రిఫ‌రెన్స్‌తో పార్టీలో కొన‌సాగాల్సిన ప‌రిస్థితి ఉండ‌డం కూడా ఆయ‌న‌కు కాస్త బాధ‌గా ఉందంటున్నారు. ఇక ప‌ర‌వాడ టీడీపీ రేసులో చాలా మంది నేత‌లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాజ్జీతో పాటు ప‌లువురు రేసులో ఉన్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బండారు వార‌సుడు అప్ప‌ల నాయుడు యాక్టివ్ కాక‌పోతే 2024 నాటికి గండి బాబ్జీ స్పీడ్‌గా ఉంటే ఆయ‌న‌కే టికెట్ ఖాయమని అంటున్నారు. అదే జరిగితే బండారు సత్యనారాయణమూర్తి పొలిటికల్ కెరీర్ కి శాశ్వతంగానే గండి పడిపోవ‌డంతో పాటు ఆయ‌న కుటుంబానికి కూడా చెక్ ప‌డిన‌ట్ల‌వుతుంది.




ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలుస్తేతండ్రికి తగ్గ కూతుర్లు అనుకుంటారు.!

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>