MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla8fd3968c-a876-4cde-b6d3-eeccde9b0e08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla8fd3968c-a876-4cde-b6d3-eeccde9b0e08-415x250-IndiaHerald.jpgఏపీలో 30 లక్షల మంది పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్నటివరకు ఈ ఇళ్ల పట్టాల విషయాలో టీడీపీ కోర్టులకు వెళ్ళి అడ్డుకుందని వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు, విమర్శలు ఇలా కొనసాగుతుండగానే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసింది. ysrcp mla;cbn;sunil;jagan;2019;court;mla;aqua;tdp;ycp;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జడ్జీల మీద కామెంట్ చేసి హైలైట్ అయిపోయారుగా...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జడ్జీల మీద కామెంట్ చేసి హైలైట్ అయిపోయారుగా...ysrcp mla;cbn;sunil;jagan;2019;court;mla;aqua;tdp;ycp;partyTue, 29 Dec 2020 05:00:00 GMTవైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్నటివరకు ఈ ఇళ్ల పట్టాల విషయాలో టీడీపీ కోర్టులకు వెళ్ళి అడ్డుకుందని వైసీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు, విమర్శలు ఇలా కొనసాగుతుండగానే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసింది.

అయితే ఇళ్ల పట్టాల పంపిణీలోనే పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎం‌ఎస్ బాబు జడ్జీల మీద కామెంట్లు చేసి, ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ఇప్పుడు పదవుల్లో కొనసాగుతోన్న వాళ్లు అసలు జడ్జిలేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకు జడ్జీలు అనుకూలంగా తీర్పు చెబుతారని విమర్శించారు. ఇలా మాట్లాడే బాబు హైలైట్ అయ్యారు. అసలు ఎం‌ఎస్ బాబు రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు పెద్దగా హైలైట్ కాలేదు.

మొదట్లో అసెంబ్లీలో అర్థరహితంగా ప్రమాణస్వీకారం చేసి జాతీయ ఛానెళ్లకూ వార్తాంశమయ్యారు. లాక్ డౌన్ సమయంలో సొంత పొలంలో వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలిచారు. అయితే మొన్న ఎన్నికల్లో ఎం‌ఎస్ బాబు, జగన్ ఇమేజ్‌తో దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్...నియోజకవర్గంలో సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు. ఎక్కువ హడావిడి చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.

అటు ప్రభుత్వ పథకాల వల్ల పూతలపట్టు ప్రజలు ఎక్కువగానే లబ్దిపొందుతున్నారు. అయితే నియోజకవర్గంలో తాగునీటి, సాగునీటి సమస్యలని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బాబు కృషి చేస్తున్నారు. ఇక పార్టీ పరంగా వైఎస్సార్‌సీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పటికే టీడీపీ కేడర్ చాలావరకు బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి వచ్చేసింది. అటు లలితకుమారి కూడా టీడీపీని వీడటంతో, వైఎస్సార్‌సీపీకి బాగా కలిసొచ్చింది

గత 27 ఏళ్ల నుంచి టీడీపీలో ఉంటున్న లలిత... పలమనేరు నియోజకవర్గం నుంచి 2004లో విజయం సాధించారు. ఇక 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పూతలపట్టు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ అనూహ్యంగా ఆమె టీడీపీని వీడారు. ఇప్పుడు అక్కడ టీడీపీని నడిపించే నాయకులే లేరు. ఇలా టీడీపీ వీక్ అవ్వడంతో, ఎమ్మెల్యే బాబుకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది.




ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>