PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yedyurappac0696461-8fa0-4933-8496-55d5aec12bd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yedyurappac0696461-8fa0-4933-8496-55d5aec12bd7-415x250-IndiaHerald.jpgకర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.. వివాదాస్పద గోవధ వ్యతిరేక బిల్లును ఎలాగై అమలు చేయాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తోంది. గోవధ వ్యతిరేక బిల్లు అమలు చేసేందుకు ఏకంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయించింది. గోవధ వ్యతిరేక బిల్లుపై తెచ్చిన ఆర్డినెన్సును కర్ణాటక మంత్రివర్గం ఆమోదంచింది. ఈ కర్ణాటక గోవధ నివారణ పశువుల సంరక్షణ బిల్లు 2020 ప్రకారం గోవధ చేసిన వారికి, దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతే కాదు.. జైలు శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారు. అyedyurappa;amala akkineni;bharatiya janata party;karnataka - bengaluru;congress;2020;minister;cow slaughterఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న యడ్యూరప్ప..?ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న యడ్యూరప్ప..?yedyurappa;amala akkineni;bharatiya janata party;karnataka - bengaluru;congress;2020;minister;cow slaughterTue, 29 Dec 2020 06:50:38 GMTగోవధ వ్యతిరేక బిల్లును ఎలాగై అమలు చేయాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తోంది. గోవధ వ్యతిరేక బిల్లు అమలు చేసేందుకు ఏకంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయించింది. గోవధ వ్యతిరేక బిల్లుపై తెచ్చిన ఆర్డినెన్సును  కర్ణాటక మంత్రివర్గం ఆమోదంచింది.

కర్ణాటక గోవధ నివారణ పశువుల సంరక్షణ బిల్లు 2020 ప్రకారం గోవధ చేసిన వారికి, దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతే కాదు.. జైలు శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారు. అయితే ఈ బిల్లును ఇటీవలే శాసనసభ ఆమోదించింది. కానీ శాసన మండలిలో బీజేపీకి పూర్తి బలం లేనందువల్ల మొన్న గందరగోళం జరిగింది. ప్రతిపక్షాల ఆందోళన కారణంగా ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు.

ఈ బిల్లు ఆమోదం విషయంలోనే మొన్న ఏకంగా డిప్యూటీ స్పీకర్‌ను ఆ సీట్లో నుంచి కాంగ్రెస్ సభ్యులు లాగిపడేశారు. అదో పెద్ద గొడవైపోయింది. మండలి ఆమోదించకపోయినా.. ఎలాగైనా బిల్లును అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న యడ్యూరప్ప సర్కారు ఆర్డినెన్సును తీసుకొస్తోంది. ఈ గోవధ నిషేధం కేవలం గో మాంసానికి మాత్రమే అని గొడ్డు మాంసం వినియోగంపై నిషేధం లేదని కర్ణాటక మంత్రి జె. సి. మధు స్వామి అంటున్నారు.

అంతే కాదు.. గోవధ వ్యతిరేక చట్టం కొత్తది కాదన్న ఆయన దశాబ్దాలుగా 13 ఏళ్లలోపు ఉన్న గోవుల వధపై నిషేధం ఉందని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని మధుస్వామి తెలిపారు. ఒట్టిపోయిన ఆవులను పోషించే భారం రైతులపై పడకుండా ఉండేందుకు  గోశాలలను నిర్మించే అంశాన్ని కూడా కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తానికి దక్షిణాదిలో బలంగా పాతుకుపోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ తన హిందూత్వ ఎజెండాను మరింత పటిష్టంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.  


ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>