SportsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/australiaf6fe9cbf-f3e9-4e68-8a6e-be3611c7f744-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/australiaf6fe9cbf-f3e9-4e68-8a6e-be3611c7f744-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా టీంకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లని ఆస్ట్రేలియా తక్కువగా వేసి ఉండటంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఆ జట్టుకి 40% మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పాయింట్ల కోత కూడా పడింది.australia;india;australia;telugu;adelaide;paruguటీమిండియా చేతిలో ఓడిన ఆస్ట్రేలియాకు మరో గట్టిదెబ్బ...టీమిండియా చేతిలో ఓడిన ఆస్ట్రేలియాకు మరో గట్టిదెబ్బ...australia;india;australia;telugu;adelaide;paruguTue, 29 Dec 2020 23:00:00 GMTఅడిలైడ్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘోరమైన ఓటమిని చవిచూసిన ఇండియా, మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మొదటి టెస్ట్ మ్యాచ్ లోని ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం ప్రారంభమైన ఈ మెల్‌బోర్న్ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ లో 195 పరుగులకి ఆలౌట్ కాగా.. భారత్ మొదటి ఇన్నింగ్స్‌ లో 326 పరుగులు చేసింది. దాంతో.. 131 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 200 పరుగులకే కుప్పకూలగా.. 70 పరుగుల టార్గెట్ టీమిండియా ముందు నిలిచింది. ఈ లక్ష్యాన్ని భారత్ 2 వికెట్ల కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించేసింది.



అయితే ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా టీంకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లని ఆస్ట్రేలియా తక్కువగా వేసి ఉండటంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఆ జట్టుకి 40% మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పాయింట్ల కోత కూడా పడింది. సాధారణంగా వన్డే, టీ20ల్లో తరచూ జట్లు స్లో ఓవర్ తప్పిదానికి పాల్పడుతూ ఉంటాయి. కానీ.. టెస్టుల్లో ఈ తప్పిదం చోటు చేసుకోవడం చాలా అరుదు. ఒక ఓవర్‌ని తక్కువగా వేస్తే 20 శాతం, రెండు ఓవర్లకి 40 శాతం జరిమానా పడుతుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 322 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా.. భారత్ ఖాతాలో 390 పాయింట్లు ఉన్నా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి కారణం.. ఐసీసీ ఇటీవల రూల్స్‌ మార్చడమే. ర్యాంక్‌లను పాయింట్ల ఆధారంగా కాకుండా.. టీమ్స్ సాధించిన పాయింట్ల శాతం ఆధారంగా ఐసీసీ కేటాయిస్తోంది. దాంతో.. భారత్ (0.722) కంటే ముందు ఆస్ట్రేలియా (0.766) నిలిచింది.
 




లడఖ్ లో దేశంలోనే ఎత్తయిన వాతావరణ కేంద్రం ప్రారంభం...

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>