Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-kanthb71f5b25-e994-4504-ac1d-a2bbb86ed2aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-kanthb71f5b25-e994-4504-ac1d-a2bbb86ed2aa-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన రజినీకాంత్... తాజాగా ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులతోపాటు ప్రజలకు నిరాశ కలిగిస్తుందనే విషయం తనకు తెలుసన్న రజినీకాంత్.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమింrajini;rajinikanth;soundarya;aishwarya;cinema;rajani kanth;tamil;chennai;service;partyరాజకీయాలకు దూరం అయినా ...ప్రజలకోసమే పని చేస్తా ....!?రాజకీయాలకు దూరం అయినా ...ప్రజలకోసమే పని చేస్తా ....!?rajini;rajinikanth;soundarya;aishwarya;cinema;rajani kanth;tamil;chennai;service;partyTue, 29 Dec 2020 13:40:56 GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన రజినీకాంత్... తాజాగా ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులతోపాటు ప్రజలకు నిరాశ కలిగిస్తుందనే విషయం తనకు తెలుసన్న రజినీకాంత్.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలని వారిని కోరారు.వాస్తవానికి ఈ నెల 31న కొత్త పార్టీని ప్రకటించనున్నామని రజనీ తెలిపారు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీని ప్రకటించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇటీవలే హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తీవ్రమైన బీపీ హెచ్చుతగ్గులతో ఆయన బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎంతో ఒత్తిడి ఉండే రాజకీయాలు వద్దని ఆయన కుమార్తె ఐశ్వర్యతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఆయనను కోరారు. దీంతో, ఆయన పార్టీ పెట్టే యోచనను విరమించుకున్నారు.

రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. తన అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నాత్తై సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారని రజినీకాంత్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజినీకాంత్.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్మకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు.

 అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి పార్టీ పెట్టడం లేదని తలైవా మంగళవారం సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తలైవా  ట్విటర్‌ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖను విడుదల చేశారు.అన్నత్తే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రజనీకాంత్ అనారోగ్యానికి గురై హైదరాబాద్‌ లోని అపోలో ఆసుపత్రిలో ఐదు రోజుల కింద చేరారు. ఆతర్వాత డిశ్చార్జ్ అయిన అనంతరం శనివారం చెన్నై చేరుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనను విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంటున్నారు


వేగం పెంచేస్తున్న యంగ్ రెబల్ స్టార్..!

బుల్లిపిట్ట: యాపిల్‌ను విమర్శించిన చైనా కంపెనీ.. ఇప్పుడు చేసే పనేంటి?

కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇలా చేయరు: చంద్రబాబు

రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

రియల్ లైఫ్ 'కాంచన'.. ఆ ఒక్కటే తేడా..

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>