PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-vuhan9ff1627b-8cc8-40df-887f-4111cb8e3781-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-vuhan9ff1627b-8cc8-40df-887f-4111cb8e3781-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం జరిగింది.మంగళవారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మంగళవారం 67 కేసులు వచ్చాయి. ఇక, విజయనగరంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, రెండు రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వచ్చాయి. గత రెండ్రోజులుగా విజయనగరం జిల్లాలో సున్నా కేసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రెండు కేసులు వచ్చాయి. కరోనా వైరcarona-virus;india;krishna river;bari;vijayanagaram;letter;vizianagaram;coronavirusఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు....ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు....carona-virus;india;krishna river;bari;vijayanagaram;letter;vizianagaram;coronavirusTue, 29 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం జరిగింది.మంగళవారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మంగళవారం 67 కేసులు వచ్చాయి. ఇక, విజయనగరంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, రెండు రోజుల తర్వాత విజయనగరం జిల్లాలో మళ్లీ కరోనా కేసులు వచ్చాయి. గత రెండ్రోజులుగా విజయనగరం జిల్లాలో సున్నా కేసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం రెండు కేసులు వచ్చాయి.


కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచగా, కేసుల్లో పెరుగుదల నమోదవ్వడం జరిగింది. సోమవారం అత్యల్పస్థాయిలో 212 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పడిపోయాయి. మంగళవారం 364 మంది కోవిడ్‌ 19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,71,116 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,383కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. అయితే మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 50,794 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,81,599కి చేరింది.కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. కరోనా మహమ్మారి బారిన పడి మంగళవారం ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,100కు చేరింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ కి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..


లడఖ్ లో దేశంలోనే ఎత్తయిన వాతావరణ కేంద్రం ప్రారంభం...

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>