SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/boxing-day-teste539abe2-fa38-45fa-8eab-f19f09696c6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/boxing-day-teste539abe2-fa38-45fa-8eab-f19f09696c6c-415x250-IndiaHerald.jpgబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఘోర ఓటమిని చవి చూసిన టీమిండియా, రెండో టెస్టులో ఆతిథ్య ఆస్టేలియా జట్టును మట్టికరిపిస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.ఈ గెలుపుకు ప్రధాన కారణం కెప్టెన్ రహానేనే అని కచ్చితంగా చెప్పొచ్చు. జట్టు కూర్పుతో పాటు బౌలింగ్ లో తగిన మార్పులు, ఫీల్డింగ్ మోహరింపు, వ్యక్తిగత సెంచరీ, డీఆర్ఎస్ నిర్ణయాలు ఇవన్నీ భారత జట్టును విజయం దిశలో నడిపించాయి. అలానే అరంగేట్ర ఆటగాళ్లు సిరాజ్‌, గిల్‌లు కూడా చక్కని ప్రదర్శన చేసారు. boxing day test;pruthvi;virat kohli;cricket;ravindra jadeja;india;rishabh pant;yuva;kollu ravindra;prithvi shaw;mohammed shami;paruguఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్boxing day test;pruthvi;virat kohli;cricket;ravindra jadeja;india;rishabh pant;yuva;kollu ravindra;prithvi shaw;mohammed shami;paruguTue, 29 Dec 2020 20:49:52 GMTబోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన జరిగిన రెండో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) లో భారత్ అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే.  తొలి టెస్టులో ఘోర ఓటమి, కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ కు దూరమవడం, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలగడంతో పాటు  తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి టెస్టు చరిత్రలో భారత్ తిరిగి చెత్త రికార్డును మూటగట్టుకున్న తరుణంలో రెండో టెస్టులో భారత జట్టు ప్రదర్శనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈ అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తూ స్టాండ్ ఇన్ కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలో రెండో టెస్టులో స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేసిన టీమిండియా ఆతిథ్య ఆస్టేలియా జట్టును మట్టికరిపిస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఈ గెలుపుకు ప్రధాన కారణం కెప్టెన్ రహానేనే అని కచ్చితంగా చెప్పొచ్చు. జట్టు కూర్పుతో పాటు బౌలింగ్ లో తగిన మార్పులు, ఫీల్డింగ్ మోహరింపు, వ్యక్తిగత సెంచరీ, డీఆర్ఎస్ నిర్ణయాలు ఇవన్నీ భారత జట్టును విజయం దిశలో నడిపించాయి. ఓపెనర్ పృథ్వీ షా పేలవ ప్రదర్శనతో టెస్టుల్లో అర్రంగేట్రం చేసిన జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ ఎక్కడా తడబడకుండా చక్కటి క్రికెట్ షాట్లతో మంచి ప్రదర్శన చేసాడు. తొలి ఇన్నింగ్స్ లో 45, రెండో ఇన్నింగ్స్ లో 35* పరుగులు చేసాడు. అలానే షమీ స్థానంలో భారత టెస్ట్ క్యాప్ అందుకున్న హైదరాబాదీ పేసర్  కెప్టెన్ ఆశలను వమ్ము చేయకుండా తొలి ఇన్నింగ్స్ లో 2, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సీనియర్ వికెట్ కీపర్ స్థానంలో జట్టులో చోటు సంపాదించిన రిషబ్ పంత్... వికెట్ల వెనకాల ఉండి బౌలర్లను ప్రోత్సహిస్తూ... ఆసీస్ బ్యాట్స్ మెన్ ఏకాగ్రత దెబ్బ తీస్తూ తలనొప్పిగా మారాడు.

 ఇక జట్టు కూర్పులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రదర్శన గురించే.. జడేజాను తుది జట్టులోకి తీసుకోవాలని రహానే తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ లీడ్ సాధించడానికి ఆరో వికెట్ కు రహనే, జడేజాలు జోడించిన 119 పరుగుల భాగస్వామమే అత్యంత కీలకంగా మారింది.  ఆల్ రౌండర్ జడేజా సహాకారం రహానే సెంచరీ చేయడానికి ఎంతో ఉపయోగపడింది. రహానే బ్యాట్ తో కీలకమైన 57 పరుగులు చేయడంతో పాటు,  ఇన్నింగ్స్ లో 1, రెండో ఇన్నింగ్స్ లో 2  వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ అరంగేట్ర ఆటగాళ్లు సిరాజ్‌, గిల్‌లకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పొచ్చు. కెప్టెన్ రహానే కూడా ఈ మ్యాచ్ విన్నింగ్  క్రెడిట్‌ను అరంగేట్ర ఆటగాళ్లు సిరాజ్‌, గిల్‌కే ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. మొత్తానికి ఈ మ్యాచ్  కెప్టెన్ రహానేతో పాటు సిరాజ్‌, గిల్‌లకు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పవచు.




జగన్ చేసిన ఆ పనితో వణుకు ?

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !

కేసీఆర్ యూ టర్న్ తో తెలంగాణ బీజేపీ లో సంచలనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>