MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcrf0232072-f540-4b6c-bc94-527b724d09dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kcrf0232072-f540-4b6c-bc94-527b724d09dc-415x250-IndiaHerald.jpg"నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతోందిట"..మన పెద్దలు ఈ సామెతను ఊరికే సచెప్పలేదండోయ్..! ఒక్కోసారి మనం తొందరపదో, లేక కావాలనో మాట ఇస్తూ ఉంటాం.. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా.. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన తెలంగాణ సీఎం గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారట..అసలు విషయం ఏమిటంటే " ఓ సవతితల్లి నరకం నుంచి బయటపడిన ఒక అమ్మాయిని.. తన దత్తపుత్రికగా స్వీకరించటం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్నారు. ఏదో మాట వరసకు దత్తపుత్రిక అన్న మాట కాకుండా.. ఏకంగాkcr;kcr;ktr;kavitha;telangana;marriage;chief minister;episode;reddy;sakshi;divya bhatnagarతన దత్తపుత్రిక పెళ్లికి మన సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో తెలుసా..??తన దత్తపుత్రిక పెళ్లికి మన సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో తెలుసా..??kcr;kcr;ktr;kavitha;telangana;marriage;chief minister;episode;reddy;sakshi;divya bhatnagarTue, 29 Dec 2020 17:00:00 GMTతెలంగాణ సీఎం గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారట..అసలు విషయం ఏమిటంటే " ఓ సవతితల్లి నరకం నుంచి బయటపడిన ఒక అమ్మాయిని.. తన దత్తపుత్రికగా స్వీకరించటం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్నారు. ఏదో మాట వరసకు దత్తపుత్రిక అన్న మాట కాకుండా.. ఏకంగా ఆమెను తన నివాసానికి పిలిచి.. కలిసి భోజనం చేయటం.. ఇకపై ఆమె తన ఇంట్లో సభ్యురాలని.. తన పిల్లల మాదిరే తనను చూసుకుంటానని హామీ ఇవ్వటాన్నిచాలామంది హర్షించారు.

మాట వరసకు దత్తపుత్రిక అన్నట్లు కాకుండా ఆమె బాగోగుల్ని ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తున్న కేసీఆర్.. తీరా పెళ్లి వద్దకు వచ్చేసరికి మాత్రం..హాజరు కాకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దత్తపుత్రిక కాబట్టే.. వెళ్లలేదు.. అదే సొంత కూతురైతే పెళ్లికి వెళ్లకుండా ఉంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దత్తపుత్రికను సొంత కుమార్తెతో పోలుస్తారా? అన్న ప్రశ్నను కొందరు సంధిస్తున్నా.. అసలు.. కొసరు అన్న తేడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నది మర్చిపోకూడదు.గడిచిన మూడు.. నాలుగు రోజులుగా కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహానికి సంబంధించిన వార్తలు మీడియాలో జోరుగా వస్తున్నాయి. క్త్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లికుమార్తె ప్రత్యూష మెడలో పెళ్లికొడుకు చరణ్ రెడ్డి తాళి కట్టారు. దాదాపురెండు గంటల పాటు శాస్త్రోక్తంగా వివాహ వేడుక సాగింది.పెళ్లి కుమార్తె తరఫున సాక్షిగా మహిళా.. శిశు సంక్షేమ శాఖ కమిషననర్ దివ్య దేవరాజన్ సంతకం చేయగా..

 వరుడి తల్లి తరుఫున అతడి చల్లి మేరీ సాక్షి సంతకం చేశారు. పెద్ద ఎత్తున అధికారులు.. నేతలు హాజరైన ఈ పెళ్లి వేడుకకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైతే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపించింది. పెళ్లి కుమార్తెను చేసే సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ.. స్వయంగా వెళ్లి.. పట్టువస్త్రాలు.. డైమండ్ నెక్లస్ బహుకరించి.. ఆశీర్వదించి రావటం గమనార్హం. సారు దత్తపుత్రిక పెళ్లి వేడుక ఎపిసోడ్ లో ఎక్కడా కుమారుడు కేటీఆర్ కానీ.. కుమార్తె కవిత కానీ కనిపించకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తుండటం గమనార్హం. దత్తపుత్రిక అన్న మాటకు తగ్గట్లే.. పెళ్లి వేడుకకు హాజరై ఉంటే నిండుతనంతో పాటు.. తాను అన్న మాటను నిలబెట్టుకునే వారు కదా..అనే వాదనలు వినిపిస్తున్నాయి...!!


ఓ ఐస్ బర్గ్.. వందల జంతువులు.. భయం గుప్పిట్లో ఇంగ్లాండ్

రాష్ట్రపతి దగ్గరకు వెళ్తాం: జేసి పవన్ వార్నింగ్

సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

బాక్సింగ్ టెస్ట్ : రహనే అరుధైన రికార్డ్..ధోని తరవాత అతనే !!

డ్రంక్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్టులతో సమానం.. సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి,గుర్తింపు లేని మరణం పొందిన యంగ్ హీరో ఎవరో మీకు తెలుసా?

సైబర్ నేరస్థుల కొత్త టెక్నిక్ ... తస్మాత్ జాగ్రత్త.!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>