PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana8f24d934-d569-4b80-b38c-e1537123db6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana8f24d934-d569-4b80-b38c-e1537123db6a-415x250-IndiaHerald.jpgసాధారణంగా అత్తా కోడళ్ళకు పడదు. అదేదో దేవుడు కావాలని పెట్టినట్టు ఎక్కడ చూసినా అత్తా కోడళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ఎక్కడో అతి కొద్ది మంది అత్తాకోడళ్లు మాత్రం అన్యోన్యంగా ఉంటారు. అయితే ఎక్కువగా కోడళ్ళ మీద అత్తలు తమ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. చాలా తక్కువ కేసుల్లో అత్తలని కోడళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. కానీ అధిక భాగం చూసుకుంటే కోడళ్ళ మీద అత్తలదే డామినేషన్ అని చెప్పచ్చు. ఈ కాన్సెప్ట్ తో అనేక సినిమాలు కూడా వచ్చాయి. కానీ తెలంగాణలో అందుకు విరుద్దంగా ఒక ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ కోడలు కోపం పట్టtelangana;revathi;bhaskar;deva;prasad;district;baba bhaskar;kurnool;police;wifeఅత్త ముక్కు కొరికేసిన కోడలు.. అసలేమైఁదంటే ?అత్త ముక్కు కొరికేసిన కోడలు.. అసలేమైఁదంటే ?telangana;revathi;bhaskar;deva;prasad;district;baba bhaskar;kurnool;police;wifeTue, 29 Dec 2020 16:00:00 GMTసాధారణంగా అత్తా కోడళ్ళకు పడదు. అదేదో దేవుడు కావాలని పెట్టినట్టు ఎక్కడ చూసినా అత్తా కోడళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ఎక్కడో అతి కొద్ది మంది అత్తాకోడళ్లు మాత్రం అన్యోన్యంగా ఉంటారు. అయితే ఎక్కువగా కోడళ్ళ మీద అత్తలు తమ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. చాలా తక్కువ కేసుల్లో అత్తలని కోడళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. కానీ అధిక భాగం చూసుకుంటే కోడళ్ళ మీద అత్తలదే డామినేషన్ అని చెప్పచ్చు. ఈ కాన్సెప్ట్ తో అనేక సినిమాలు కూడా వచ్చాయి. కానీ తెలంగాణలో అందుకు విరుద్దంగా ఒక ఘటన చోటు చేసుకుంది. 

తాజాగా ఓ కోడలు కోపం పట్టలేక  ఏకంగా అత్తగారి ముక్కు కొరికేసింది. సంచలనం రేపుతున్న ఈ ఘటన అలంపూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ల్లోకి వెళ్తే తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్‌ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్‌ కర్నూలులోని అత్తగారి ఇంట్లో ఇల్లరికం ఉంటున్నాడు. 

అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ఉదయం మరో సారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్‌ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్పటికప్పుడు ముక్కుకు ఏడు కుట్లు వేశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అత్త ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోడలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాను కోపంలో అలా చేశానని హాని చేయాలని కాదని ఆమె చెబుతోంది. 

 




సైబర్ నేరస్థుల కొత్త టెక్నిక్ ... తస్మాత్ జాగ్రత్త.!?

టీడీపీ చిల్లర రాజకీయాలు ఆపాలి... అవినాష్ వార్నింగ్

పవన్ వకీల్ సాబ్ కాదు... కొత్త పేరు పెట్టిన ఏపీ మంత్రి

కొత్త సంవత్సరంలో బిజీ కానున్న బాలయ్య .. ఎందుకో తెలుసా

జగనన్న క్యాంటిన్ పెట్టొచ్చు... జగన్ కు బిజెపి సలహా

అన్ని సేవలూ ఒకే యాప్ ద్వారా..!

పీకే వరకు వెళ్ళిన లోకేష్ బాబు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>