MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothineni32cdc0b3-0aa3-4118-be65-06197ff017cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothineni32cdc0b3-0aa3-4118-be65-06197ff017cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. ఇలియానా హీరోయిన్ గా బొమ్మరిల్లు బ్యానర్ పై వై.వి.యస్.చౌదరి సొంతంగా నిర్మించిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక దీని తర్వాత సుకుమార్ తో చేసిన జగడం సినిమాతో ప్లాప్ అయినప్పటికీ అందులో తన ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను అలరించిన హీరో రామ్, ఆపై శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన రెడీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ని అందుకున్నారు. ram pothineni;red movie;kumaar;sameer;amrutha;choudary actor;kranthi;kranti;malavika new;mani sharma;nivetha pethuraj;puri jagannadh;raj;ram pothineni;shankar;sukumar;tiru;makar sakranti;tollywood;cinema;sankranthi;huzur nagar;january;tirupati;episode;ismart shankar;blockbuster hit;hero;heroine;nivetha thomas;success;ileana d'cruz;reddy;v;kishore tirumala;redమొత్తానికి రామ్ నక్క తోక తొక్కినట్లున్నాడే .....??మొత్తానికి రామ్ నక్క తోక తొక్కినట్లున్నాడే .....??ram pothineni;red movie;kumaar;sameer;amrutha;choudary actor;kranthi;kranti;malavika new;mani sharma;nivetha pethuraj;puri jagannadh;raj;ram pothineni;shankar;sukumar;tiru;makar sakranti;tollywood;cinema;sankranthi;huzur nagar;january;tirupati;episode;ismart shankar;blockbuster hit;hero;heroine;nivetha thomas;success;ileana d'cruz;reddy;v;kishore tirumala;redTue, 29 Dec 2020 22:24:29 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. ఇలియానా హీరోయిన్ గా బొమ్మరిల్లు బ్యానర్ పై వై.వి.యస్.చౌదరి సొంతంగా నిర్మించిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక దీని తర్వాత సుకుమార్ తో చేసిన జగడం సినిమాతో ప్లాప్ అయినప్పటికీ అందులో తన ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను అలరించిన హీరో రామ్, ఆపై శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన రెడీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ని అందుకున్నారు.

ఇక అక్కడి నుంచి వరుస అవకాశాలతో కొనసాగిన రామ్, ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా కొంత సతమతమయ్యారు. అయితే గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి ఎట్టకేలకు రామ్ కెరీర్ కి మంచి ఊపునిచ్చింది. ఇక ప్రస్తుతం రామ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఇందులోని సాంగ్స్ అలానే థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ అందించడం జరిగింది. సెన్సార్ సభ్యుల నుంచి కూడా మూవీ పై ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో యూనిట్లో సినిమా సక్సెస్ పై మంచి హోప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి ఈ సినిమాకు సంబంధించి అందుతున్న సమాచారాన్ని బట్టి సినిమా మొత్తం ఎంతో ఆకట్టుకునే రీతిలో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారని ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ వంటివి సినిమా చూసే ప్రేక్షకులని అలరించడం ఖాయమని ముఖ్యంగా మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు అయితే ప్రేక్షకులకు మంచి ఐఫీస్ట్ ని అందిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా ద్వారా మరొక సక్సెస్ ని రామ్ తన ఖాతాలో వేసుకోనున్నారని, ఒకరకంగా ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన నక్కతోక తొక్కినట్లే అని అంటున్నారు విశ్లేషకులు......!!


రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>