SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/dhathathreya-jayanthie87241b5-bf5c-4113-9440-737e8e74f9b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/dhathathreya-jayanthie87241b5-bf5c-4113-9440-737e8e74f9b8-415x250-IndiaHerald.jpgహిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు వచ్చిన అన్ని అవతారాల్లో దత్తావతారం కూడా ఒక అవతారమని మరియు ఇది ఆరో అవతారంగా పిలవబడుతుందని పురాణాల్లో చెప్పబడినది. ఈ దత్త రూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెబుతుంటారు. dhathathreya jayanthi;jayanthi;shiva;atreya;poorna;purnima;gujarat - gandhinagar;maharashtra - mumbai;december;2020;karnataka 1;maharashtra;lord siva;jayamదత్తాత్రేయుని జయంతి విశేషాలివి...?దత్తాత్రేయుని జయంతి విశేషాలివి...?dhathathreya jayanthi;jayanthi;shiva;atreya;poorna;purnima;gujarat - gandhinagar;maharashtra - mumbai;december;2020;karnataka 1;maharashtra;lord siva;jayamTue, 29 Dec 2020 06:00:00 GMTజయంతి మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు వస్తుంది.. ముఖ్యంగా ఈ పండుగను మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయుడిని శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తారు.

ఇంతకీ మీకు దత్తాత్రేయుడు అంటే అర్ధం తెలుసా...? ‘దత్తం' అంటే ఇచ్చినవారు.. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు. దత్తాత్రేయుని ఉపనయనం అయిన వెంటనే అడవికి వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ణానాన్ని పొందాడు. 2020 సంవత్సరంలో డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఈయనకు మొత్తం ౨౪ మంది గురువులున్నట్లు చెబుతూ ఉంటారు...వీరందరి నుండి ఈయన జ్ఞానం పొందడంతో, ఎంతో జ్ఞానిగా ప్రసిద్ధి చెందారు. దత్త పురాణం ప్రకారం.. దత్తుడు పదహారు అంశలు కలవాడు.

దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతుంటారు. ఈరోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సకలశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని ‘కోర్ల పౌర్ణమి'గా పిలుస్తారు. తేదీ : డిసెంబర్ 29, 2020 శుభ ముహుర్తం ప్రారంభ సమయం : ఉదయం 7 గంటల 54 నిమిషాల నుండి (డిసెంబర్ 29, 2020) శుభ ముహుర్తం ముగింపు సమయం : మరుసటి రోజు ఉదయం 8 గంటల 57 నిమిషాల వరకు (డిసెంబర్ 30, 2020). అలాగే ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అంటారు.ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే కచ్చితంగా శుభఫలితాలు వస్తాయని పండితులు చెబుతుంటారు.


బాలయ్య తో పూరీ...ఈ సారి వేరే లెవెల్ !!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>