SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ashwin3b461b71-f679-467b-8ed4-fc1eab9fc0ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ashwin3b461b71-f679-467b-8ed4-fc1eab9fc0ab-415x250-IndiaHerald.jpgటెస్టు క్రికెట్ లో అత్యధికంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన మురళీధరన్ (191) రికార్డును భారత స్పిన్నర్ అశ్విన్ బ్రేక్ చేసాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో హాజిల్ వుడ్ ను అవుట్ చేసి ఈ ఘనత సాధించాడు. బాక్సింగ్‌ డే టెస్టుల్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్ లలో 15 వికెట్లు తీసిన బుమ్రా అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేశాడు. ashwin;chandran new;rani;ravi anchor;cricket;india;australia;sri lanka;naga aswin;joshబాక్సింగ్ డే టెస్టు... అశ్విన్, బూమ్రా సరికొత్త రికార్డులుబాక్సింగ్ డే టెస్టు... అశ్విన్, బూమ్రా సరికొత్త రికార్డులుashwin;chandran new;rani;ravi anchor;cricket;india;australia;sri lanka;naga aswin;joshTue, 29 Dec 2020 19:46:32 GMTబోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన జరిగిన రెండో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) లో భారత్ అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. కెప్టెన్ అజింక్య రహానే సూపర్ సెంచరీకి తోడు భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ ఈ టెస్టులో విజయాన్ని నమోదు చేసి టెస్టు సిరీస్ ను 1-1 తో సమం చేసింది. అజింక్య రహానేకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టెస్టు అనంతరం టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ లు పాత రికార్డులను బ్రేక్ చేసారు.

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో రెండు మొత్తం ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ కొత్త రికార్డు సాధించాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్ లో అత్యధికంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో చివరి వికెట్ అయిన జోష్ హాజిల్ వుడ్ ను అవుట్ చేసిన అశ్విన్ మొత్తం 192 మంది లెఫ్ట్ హ్యాండర్స్‌ను అవుట్ చేసి ఈ  రికార్డు సాధించాడు. కాగా ఈ రికార్డు ఇంతకు ముందు స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీ ధరన్ (శ్రీలంక) పేరిట ఉండేది. టెస్టుల్లో మొత్తం 700 వికెట్లు తీసిన మురళీధరన్ అందులో మొత్తం 191 మంది ఎడమ చేతి బ్యాట్స్ మెన్ ల వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా అశ్విన్ ఆ రికార్డును బ్రేక్ చేసాడు.

 అలానే పేసర్ జస్ప్రిత్ బుమ్రా కూడా భారత లెజండరీ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఆసీస్‌ పర్యటనలో భాగంగా మొత్తం మూడు బాక్సింగ్‌ డే టెస్టులు ఆడిన కుంబ్లే 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 15 వికెట్లు తీయగా బుమ్రా కేవలం 4 ఇన్నింగ్స్‌లలోనే (రెండు మ్యాచ్లు) 15 వికెట్లు తీసి కుంబ్లే రికార్డును సమం చేశాడు.




ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !

కేసీఆర్ యూ టర్న్ తో తెలంగాణ బీజేపీ లో సంచలనం..?

సాక్షి నిరూపిస్తుందా...?

జగన్ సీరియస్ గా పని చేస్తున్నా వాళ్ళు చేయడం లేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>