PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babud54f0036-4f63-4946-8fa9-e3afa545bfdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babud54f0036-4f63-4946-8fa9-e3afa545bfdb-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతోంది. ఆ పార్టీకి జమిలి ఎన్నికలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఒక్క ఏడాది కళ్ళు మూసుకుంటే చాలు అధికారం తెలుగుదేశం పరం అవుతుంది అని చంద్రబాబు గట్టి నమ్మకాన్నే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఎన్నికలగోదాలోకి దిగాలని భావిస్తున్నారని టాక్. babu;cbn;delhi;bharatiya janata party;telugu desam party;jagan;2019;telugu;central government;master;partyఢిల్లీ యాత్రకు బాబు రెడీ... ఏపీలో అనూహ్య పరిణామాలు ?ఢిల్లీ యాత్రకు బాబు రెడీ... ఏపీలో అనూహ్య పరిణామాలు ?babu;cbn;delhi;bharatiya janata party;telugu desam party;jagan;2019;telugu;central government;master;partyTue, 29 Dec 2020 10:00:00 GMTతెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతోంది. ఆ పార్టీకి జమిలి ఎన్నికలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఒక్క ఏడాది కళ్ళు మూసుకుంటే చాలు అధికారం తెలుగుదేశం పరం అవుతుంది అని చంద్రబాబు గట్టి నమ్మకాన్నే పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఎన్నికలగోదాలోకి దిగాలని భావిస్తున్నారని టాక్.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోటీ చేయరాదు అన్నది కూడా బాబు ఆలోచనగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. జమిలి ఎన్నికలు కనుక వస్తే బీజేపీ జనసేనలతో కలుపుకుని ఏపీలో పోటీ చేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నాట్లుగా చెబుతున్నారు. ఏపీలో తీసుకుంటే బీజేపీ నేతలు బాబుతో పొత్తు వద్దు అని అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొందరు బీజేపీ నేతలతో మాత్రం బాబుకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు.

అందులో ఒకరిద్దరు బాబుని బీజేపీని మళ్ళీ కలపాలని కూడా చూస్తున్నారుట. బాబు కనుక ఏపీలో తమతో కలసివస్తే అధికారాన్ని అక్కడ పంచుకోవచ్చు అని ఆలోచనలు కేంద్రంలోని కీలకంగా  ఉన్న వారు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇవన్నీ వర్కౌట్ అవడానికి కొంత టైం పడుతుంది అంటున్నారు.

అదే విధంగా తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ కీలక నేత కూడా చంద్రబాబుతో పొత్తు ఉండాల్సిందేనని అంటున్నారుట. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం సులువు అవుతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారుట. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీతో తన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చంద్రబాబు తొందరలోనో ఢిల్లీ వెళ్ళి బీజేపీకి చెందిన కొందరు ముఖ్యులతో భేటీ వేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి బాబు చాలా జాగ్రత్తగానే పావులు కదుపుతున్నారు. జగన్ కి వ్యతిరేకంగా ఏపీలో కూటమిని తేవాలనుకుంటున్నారు. ఏది ఏమైనా 2019 నాటి ఒంటరి పోరాటాలు చేదు అనుభవాలను రిపీట్ చేయరాదని చంద్రబాబు గట్టిగానే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.  చూడాలి మరి ఏం జ‌రుగుతుందో.




ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలుస్తేతండ్రికి తగ్గ కూతుర్లు అనుకుంటారు.!

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>