EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/cpi-narayana2e2367e8-8d85-474b-bd76-048e46e45c77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/cpi-narayana2e2367e8-8d85-474b-bd76-048e46e45c77-415x250-IndiaHerald.jpgకమ్యూనిస్టు పార్టీలో ఏపీ, తెలంగాణలో గతంలో కొన్ని ప్రాంతాల్లో మంచి పట్టు కలిగి ఉండేవి. ఉమ్మడి ఏపీలో కనీసం ఐదారుగురు ఎర్ర కండువాల ఎమ్మెల్యేలు ఉండేవారు. ఓ పదేళ్ల నుంచి వీరి ప్రాభవం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ ఒక్క ఎమ్మెల్యే కూడా దుస్థితికి వామపక్షాలు చేరిపోయాయి. అంతేకాదు.. కొన్ని పార్టీల తోకలుగా అవి మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతగా చెప్పుకునే నారాయణ మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో కమ్యూనిస్టులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలcpi-narayana;cbn;mithra;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;mla;minister;ycp;cpi;partyఈ కమ్యూనిస్టు నేతకు ఏమైంది.. ఇలా మాట్లాడుతున్నారు..?ఈ కమ్యూనిస్టు నేతకు ఏమైంది.. ఇలా మాట్లాడుతున్నారు..?cpi-narayana;cbn;mithra;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;mla;minister;ycp;cpi;partyTue, 29 Dec 2020 22:00:00 GMTఏపీ, తెలంగాణలో గతంలో కొన్ని ప్రాంతాల్లో మంచి పట్టు కలిగి ఉండేవి. ఉమ్మడి ఏపీలో కనీసం ఐదారుగురు ఎర్ర కండువాల ఎమ్మెల్యేలు ఉండేవారు. ఓ పదేళ్ల నుంచి వీరి ప్రాభవం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ ఒక్క ఎమ్మెల్యే కూడా దుస్థితికి వామపక్షాలు చేరిపోయాయి. అంతేకాదు.. కొన్ని పార్టీల తోకలుగా అవి మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతగా చెప్పుకునే నారాయణ మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో కమ్యూనిస్టులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఉద్యమాలు చేసేవారు. కానీ.. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు అందజేస్తే దానిపైనా కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి సీపీఐ నేత నారాయణ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను కుక్కల దొడ్డితో పోల్చడం వివాదాస్పదం అవుతోంది.

నారాయణ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీపీఐ నారాయణ చంద్రబాబు నాయుడుకి లొంగిపోయి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. సీపీఐ పార్టీనీ చంద్రబాబుకు ఎప్పుడో అమ్మేశారని ఆరోపించారు.. పేదలకు ఇస్తున్న స్థలం కుక్కల దొడ్డి అంత లేదనడం నారాయణ విజ్ఞతకే వదిలేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇళ్ల స్థలం తీసుకున్న పేదల దగ్గరకు వెళ్లి నారాయణ ఆ మాటలు అనాలని సవాల్‌ విసిరారు.

నారాయణ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటుగానే స్పందించారు. నారాయణ వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. సీపీఐ నేత నారాయణ తనకు మంచి మిత్రుడని, కానీ ఆయన చంద్రబాబుకు పార్టీ అమ్మేశారని అన్నారు. జగన్ సంక్షేమ పథకాలతో తెలుగు దేశం పార్టీకి బేస్‌మెంట్‌ కదిలిపోయిందని, ఆ పార్టీని కాపాడుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని పెద్దిరెడ్డి కామెంట్ చేశారు. ఏదేమైనా పేదలకు సాయం చేస్తున్న ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు.. కానీ విమర్శించడం ఏం పద్దతి నారాయణా అంటున్నారు వైసీపీ నేతలు.


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలుసా ....??

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>