Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/sports/libra_libra/kohli-aplauded-rahane-for-stunning-victory-against-australia9cff3d33-1fce-4bed-9672-e2e6beec6dd9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/sports/libra_libra/kohli-aplauded-rahane-for-stunning-victory-against-australia9cff3d33-1fce-4bed-9672-e2e6beec6dd9-415x250-IndiaHerald.jpgరెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టును విరాట్ కోహ్లీ అభినందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించిన ఆజింక్య రహానేను ప్రశంసలతో ముంచెత్తాడు. రహానే గొప్పగా ఆడాడని, జట్టు సభ్యులంతా..kohli;naga;rani;virat kohli;india;australia;cameroon;naga aswin;kanna lakshminarayana;twitter;mayank agarwal;paruguరహానే.. నువ్వు సూపర్: కోహ్లీరహానే.. నువ్వు సూపర్: కోహ్లీkohli;naga;rani;virat kohli;india;australia;cameroon;naga aswin;kanna lakshminarayana;twitter;mayank agarwal;paruguTue, 29 Dec 2020 13:45:00 GMTమెల్‌బోర్న్: రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టును విరాట్ కోహ్లీ అభినందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించిన ఆజింక్య రహానేను ప్రశంసలతో ముంచెత్తాడు. రహానే గొప్పగా ఆడాడని, జట్టు సభ్యులంతా సమష్టిగా కృషి చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారని కోహ్లీ అన్నాడు. ఈ మేరకు మంగళవారం ఓ ట్వీట్ చేశాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై గెలవడం అద్భుతమన్నాడు. టీమిండియా శ్రమించిన తీరు అనిర్వచనీయమని కోహ్లీ ట్వీట్ చేశాడు.

జట్టు విజయం సాధించడం.. ఇంత కన్నా సంతోషం ఏదీ లేదని, రహానే తన కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపించిన తీరు అసాధారణమని కోహ్లీ తన ట్వీట్‌లో తెలిపాడు. అంతేకాకుండా టీమిండియా జైత్రయాత్ర ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. భారత జెండాతో పాటు బైసెప్స్ ఎమోజీలను యాడ్ చేశాడు.

ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారంగా భారత్ రెండో టెస్టులో పగ తీర్చుకుంది. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆజింక్య రహానే అద్భుతంగా పోరాడాడు. ముందుండి జట్టును నడింపించాడు. కెప్టెన్సీలో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన మార్క్ చూపించాడు. అతడికి జట్టు సభ్యుల నుంచి చక్కటి సహకారం అందింది. దీంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం సాధించింది.

నాలుగో రోజు 133/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం మరో 67 పరుగులు మాత్రమే చేసి మిగతా 4 వికెట్లనూ కోల్పోయింది. మొత్తంగా 200 పరుగులు సాధించి భారత్ ముందు 70 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ తరపున కామెరూన్ గ్రీన్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అశ్విన్, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఉమేశ్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

కేవలం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లానే మయాంక్ అగర్వాల్(5) మళ్లీ నిరాశపరిచాడు. పుజారా(3) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా శుభ్‌మన్(35)తో కలిసి రహానే జట్టుకు విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొతం చేసుకున్నాడు.

" style="height: 472px;">




ఆపారా... ఆయనే వద్దనుకున్నారా? రజనీ కాంత్ పార్టీపై చర్చ

ఓ తలైవా రాజకీయం... !

కేసీఆర్ యూ టర్న్ తో తెలంగాణ బీజేపీ లో సంచలనం..?

సాక్షి నిరూపిస్తుందా...?

జగన్ సీరియస్ గా పని చేస్తున్నా వాళ్ళు చేయడం లేదా...?

రాపాక పవన్ ని పట్టించుకోవట్లేదా.. పవన్ రాపాక ని పట్టించుకోవట్లేదా..?

జగన్ సంచలన నిర్ణయం... ఏపీలో కుక్కను పెంచుకోవాలంటే లైసెన్స్ కావాల్సిందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>