TechnologySS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/ladakh5c82cc23-c5ab-4305-b55a-5551418fc94e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/ladakh5c82cc23-c5ab-4305-b55a-5551418fc94e-415x250-IndiaHerald.jpgలడఖ్‌లో... దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ప్రారంభమైంది. అంతేకాదు, ఈ వాతావరణ కేంద్రానికి ఓ ప్రత్యేకత ఉంది. జమ్మూ కశ్మీర్, లడఖ్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ఈ కేంద్రం ద్వారా వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వనున్నారు. అయితే ఇది ఒక రకంగా పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టే వ్యూహమే అని చెప్పవచ్చుladakh;view;manali;pakistan;telugu;december;minister;central governmentలడఖ్ లో దేశంలోనే ఎత్తయిన వాతావరణ కేంద్రం ప్రారంభం...లడఖ్ లో దేశంలోనే ఎత్తయిన వాతావరణ కేంద్రం ప్రారంభం...ladakh;view;manali;pakistan;telugu;december;minister;central governmentTue, 29 Dec 2020 23:35:00 GMTలడఖ్‌లో... దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ప్రారంభమైంది. అంతేకాదు, ఈ వాతావరణ కేంద్రానికి ఓ ప్రత్యేకత ఉంది. జమ్మూ కశ్మీర్, లడఖ్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ఈ కేంద్రం ద్వారా వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వనున్నారు. అయితే ఇది ఒక రకంగా పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టే వ్యూహమే అని చెప్పవచ్చు. ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతంగా హోదా సంపాదించిన లడఖ్‌ లోని లేహ్‌లో ఈ ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది సముద్ర మట్టం నుంచి 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం (డిసెంబర్ 29) దీన్ని ప్రారంభించారు. దేశ భద్రత మరియు భౌగోళిక పరిస్థితుల రీత్యా ఈ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని లడఖ్ లో ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
 



ఇక ఈ వాతావరణ కేంద్రం... హిమాలయాల్లో ఏర్పాటు చేసిన రెండో వాతావరణ కేంద్రం కావడం మరో విశేషం. ఇంతకు ముందు ఇటీవలే అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఈటానగర్‌లోనూ ఇలాంటిదే మరొక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి రక్షణ సిబ్బందికి వ్యూహాత్మకంగా ఉపయోగపడనున్నాయి. భారత వాతారణ శాఖ (IMD) ఈ వాతావరణ కేంద్రం ద్వారా రోడ్లు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి తదితర అంశాలకు సంబంధించి హెచ్చరికలు, వివిధ సూచనలు చేయనుంది. ముఖ్యంగా భద్రతా బలగాల కదలికలకు కూడా ఈ సూచనలు దోహదపడనున్నాయి. ఇకపోతే కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో వాతావరణం తరచూ మారుతుంటుంది. ఈ నేపథ్యంలో సైనికులకు తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది తోడ్పడనుంది. లేహ్‌లో భారత్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని నిర్మించింది. ‘అటల్‌ టన్నెల్‌’గా నామకరణం చేసిన ఈ సొరంగ మార్గం మనాలి నుంచి లేహ్‌ వరకు 9.2 కి.మీ మేర ఉంది. ఇది సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంది.




రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఓ తలైవా రాజకీయం... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>