MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master88d86f88-8b95-405c-ae2a-da8f8bdfe4a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master88d86f88-8b95-405c-ae2a-da8f8bdfe4a8-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా కలిసి నటిస్తున్న చిత్రం మాస్టర్. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన బాణీలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ఆల్బమ్ సూపర్ హిట్‌గా నిలిచింది.master;lokesh;sethu;vijay;vijay sethupathi;india;cinema;kollywood;tamil;kannada;hindi;husband;hero;khaidi.;joseph vijay;lokesh kanagaraj;ee rojullo;khaidi new;master‘మాస్టర్’ మూవీ.. మరీ అంత లెంగ్తా?‘మాస్టర్’ మూవీ.. మరీ అంత లెంగ్తా?master;lokesh;sethu;vijay;vijay sethupathi;india;cinema;kollywood;tamil;kannada;hindi;husband;hero;khaidi.;joseph vijay;lokesh kanagaraj;ee rojullo;khaidi new;masterTue, 29 Dec 2020 12:11:14 GMTకోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ హీరోగా,  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా కలిసి నటిస్తున్న చిత్రం మాస్టర్. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన బాణీలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ఆల్బమ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఖైదీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్ పై జేవియర్ బ్రిట్టో మాస్టర్ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లోనూ దిగ్గజ హీరోలు పాన్ ఇండియా చిత్రాలపై మొగ్గుచూపుతున్నారు.

ఇదే సమయంలో మాస్టర్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మళయాళ భాషల్లో సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇటీవలే మాస్టర్ చిత్ర సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఇక దీంతో పాటు ఈ చిత్ర నిడివిపై తాజాగా చర్చ నడుస్తోంది. స్టార్ హీరో చిత్రాలు అయినప్పటికి, స్టోరీ ఏమాత్రం బోరింగ్ అనిపించినా ప్రేక్షకులు ఈ రోజుల్లో మూడు గంటల పాటు థియేటర్లో కూర్చొని సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ నేపథ్యంలో మాస్టర్ చిత్ర నిడివి 178 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ చిత్ర నిడివి మూడు గంటల పాటు ఉండనుంది. ఇటీవలి కాలంలో మూడు గంటల నిడివి ఉన్న చిత్రాలు చాలానే రిలీజ్ అయ్యాయి. వీటిలో అనేక చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి మాస్టర్ చిత్రం కథ ప్రేక్షకులను అలరించి మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోపెట్టగలుగుతుందా లేదా అన్నది చూడాలి. ఇటీవల ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారు కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.


కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇలా చేయరు: చంద్రబాబు

రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

రియల్ లైఫ్ 'కాంచన'.. ఆ ఒక్కటే తేడా..

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>