MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-crazy-offers-biggboss65b8f913-0106-438f-96ad-e67705d4b49f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-crazy-offers-biggboss65b8f913-0106-438f-96ad-e67705d4b49f-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర సంచలనం బిగ్ బాస్ ఎట్టకేలకు సీజన్ ఫోర్ పూర్తి చేసుకుంది. ముందు నుండి ఈ సీజన్ మీద పెద్దగా అంచనాలు లేకపోయినా షో గడిచే కొద్దీ ఈ సీజన్ మీద కూడా ఆసక్తి కనబరుస్తూ వచ్చారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో కొందరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. అందులో మోనాల్ - అఖిల్ జంట ఒకటి. ఇది షో కోసం క్రియేట్ చేశారో లేక వీళ్ళిద్దరూ టైంపాస్ చేశారో తెలియదు కానీ వీరిద్దరి జంట మాత్రం ప్రేక్షకులను అలరించిందని చెప్పక తప్పదు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ షోలో తమ టాలెంట్ నిరూపించుకున్న అందరికీ అవకాశాలు వస్తున్new corona;mouni roy;abhijith;akhil akkineni;bellamkonda sai sreenivas;santhosh;santosh srinivas;srinivas;bollywood;cinema;bigboss;jaggery;heroine;kandireega;santhossh jagarlapudi;adhursమోనాల్ కి సినిమా ఆఫర్.. కానీమోనాల్ కి సినిమా ఆఫర్.. కానీnew corona;mouni roy;abhijith;akhil akkineni;bellamkonda sai sreenivas;santhosh;santosh srinivas;srinivas;bollywood;cinema;bigboss;jaggery;heroine;kandireega;santhossh jagarlapudi;adhursTue, 29 Dec 2020 15:00:00 GMTతెలుగు బుల్లితెర సంచలనం బిగ్ బాస్ ఎట్టకేలకు సీజన్ ఫోర్ పూర్తి చేసుకుంది. ముందు నుండి ఈ సీజన్ మీద పెద్దగా అంచనాలు లేకపోయినా షో గడిచే కొద్దీ ఈ సీజన్ మీద కూడా ఆసక్తి కనబరుస్తూ వచ్చారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో కొందరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. అందులో మోనాల్ - అఖిల్ జంట ఒకటి. ఇది షో కోసం క్రియేట్ చేశారో లేక వీళ్ళిద్దరూ టైంపాస్ చేశారో తెలియదు కానీ వీరిద్దరి జంట మాత్రం ప్రేక్షకులను అలరించిందని చెప్పక తప్పదు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ షోలో తమ టాలెంట్ నిరూపించుకున్న అందరికీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అభిజిత్, సోహెల్, మెహబూబ్, దివి లాంటి వాళ్లకు మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. 

అయితే ఇప్పుడు మోనాల్ కు కూడా ఒక మంచి సినిమా ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే అది హీరోయిన్ అవకాశం మాత్రం కాదు ఒక ఐటెం నెంబర్ అని అంటున్నారు. కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ ఒక ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. నిజానికి ఈ సాంగ్ కోసం ముందు బాలీవుడ్ నటి మౌని రాయ్ యూనిట్ సంప్రదించింది. 

దానికి ఆమె ఓకే చెప్పింది కూడా. అయితే ఇప్పుడు ఆమె మరిన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ చేయలేమని చేతులెత్తేసినట్టు సమాచారం. ఈ క్రమంలో చాలా మందిని పరిశీలించిన సినిమా యూనిట్ ప్రస్తుతానికి మోనాల్ కి ఉన్న క్రేజ్ ని వాడుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఈ మేరకు మోనాల్ ని సంప్రదించగా దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెబుతున్నారు. ఒక రకంగా సినిమాలేవీ చేయకుండా ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒకటి చేస్తూ జనాల్లో కనిపిస్తూ ఉండటం బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

 

 




జగనన్న క్యాంటిన్ పెట్టొచ్చు... జగన్ కు బిజెపి సలహా

అన్ని సేవలూ ఒకే యాప్ ద్వారా..!

పీకే వరకు వెళ్ళిన లోకేష్ బాబు

ఈ ఏపీ మంత్రి తాగుబోతు... పుస్తకం రాస్తున్న టీడీపీ

స్థానిక సంస్థ‌ల‌పై హైకోర్టు కీల‌క ప్ర‌క‌ట‌న‌.. నిమ్మ‌గ‌డ్డ‌ను వెళ్లి క‌లవాలంటూ అధికారుల‌కు ఆదేశాలు..

10 రూపాయల కోసం కక్కుర్తి.. చివరికి 50 వేలు మాయం..?

బుల్లిపిట్ట: యాపిల్‌ను విమర్శించిన చైనా కంపెనీ.. ఇప్పుడు చేసే పనేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>