PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgసిఎం జగన్ కు, డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖలు రాసారు. తాడిపత్రిలో వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గ్యాంగ్ అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దాడి, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. కరడుగట్టిన ఫాక్షనిస్టులు కూడా ఇటువంటి దుర్మార్గానికి తెగించిన దాఖలాలు లేవు అని లేఖలో వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటికెళ్ys jagan;prabhakar;prabhakar reddy;jagan;smart phone;chintamaneni prabhakar;mla;letter;tdp;ycp;parakala prabhakar;reddy;partyజగన్ కు చంద్రబాబు లేఖజగన్ కు చంద్రబాబు లేఖys jagan;prabhakar;prabhakar reddy;jagan;smart phone;chintamaneni prabhakar;mla;letter;tdp;ycp;parakala prabhakar;reddy;partyTue, 29 Dec 2020 11:15:00 GMTజగన్ కు, డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖలు రాసారు. తాడిపత్రిలో వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గ్యాంగ్ అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దాడి,  రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఉదాహరణ అని ఆయన ఆరోపించారు.  కరడుగట్టిన ఫాక్షనిస్టులు కూడా ఇటువంటి దుర్మార్గానికి తెగించిన దాఖలాలు లేవు అని లేఖలో వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటికెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదు అని చంద్రబాబు అన్నారు. గత 19నెలల్లో వరుస దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. ఎప్పుడు, ఎటునుంచి, ఏ మాఫియా మూక దాడిచేస్తుందో అనే భయాందోళనల్లో ప్రజలు. ప్రాణాలు అరచేత పెట్టుకుని బెంబేలెత్తిపోతున్నారు అన్నివర్గాల ప్రజలు అంటూ లేఖలో వ్యాఖ్యానించారు. ఇంటి నిర్మాణానికి ఇసుక కోసం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణకు టిడిపి మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఉంటుందా..? అని నిలదీశారు.

ఎమ్మెల్యే భార్యకు మామూళ్లు ఇవ్వలేక ఇసుక సరఫరా ఆపేశానని కాంట్రాక్టర్ చెప్పడానికి, టిడిపి నాయకుడికి ఏమైనా సంబంధం ఉందా..?  అని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం గురించి విన్నాం అని పేర్కొన్నారు. కానీ ఇసుక దొంగలు ఎవరంటే ఇళ్లపై దాడికి పాల్పడటం ఇప్పుడే చూస్తున్నాం అని విమర్శించారు. ఇసుక అడిగిందెవరు..? ఇసుక సరఫరాపై సమాధానం చెప్పిందెవరు..? మధ్యలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గ్యాంగ్ దాడి చేయడం ఏమిటి..? అని ప్రశ్నించారు.  తాడిపత్రిలో భయోత్పాతం సృష్టించడం ఏమిటి..? అని నిలదీశారు. ఎవరి ఇంటికెవరు వచ్చారు, ఏం చేశారు..? సిసి కెమెరాలలో అన్నీ రికార్డు అయి వున్నాయని అన్నారు.  దాడి చేసిన వాళ్లు స్వేచ్ఛగా, నిర్భీతిగా తిరగడం గర్హనీయం అని విమర్శించారు.  బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించడం హేయం అన్నారు.


రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>