MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karunamayudu-movie9ec21ac5-6c3d-4540-8c52-4e222154b93a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karunamayudu-movie9ec21ac5-6c3d-4540-8c52-4e222154b93a-415x250-IndiaHerald.jpgదేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆ దేవుళ్ళ పాత్రల్లో కొంతమంది నటులు నటిస్తే మాత్రం దేవుళ్ళు వాళ్లలానే ఉంటారేమో అన్న భావన కలుగుతుంది. ఎన్టీఆర్ వేసిన శ్రీకృష్ణుడి పాత్ర గాని, విజయ్ చందర్ వేసిన సాయిబాబా, జీసస్ పాత్రలు గాని ఈ భావనను కలుగజేస్తాయి. karunamayudu movie;ntr;bhavana;deva;vijay;hyderabad;audi;rbi;cinema;telugu;history;sri krishna;chennai;joseph vijay;nandamuri taraka rama rao;father;nijamఆస్తులు మొత్తం అమ్మితే సగం సినిమా అయ్యింది ..చివరికి పేకాట డబ్బుల్లాతో పూర్తయిన ఆ సినిమా ఏంటి..?ఆస్తులు మొత్తం అమ్మితే సగం సినిమా అయ్యింది ..చివరికి పేకాట డబ్బుల్లాతో పూర్తయిన ఆ సినిమా ఏంటి..?karunamayudu movie;ntr;bhavana;deva;vijay;hyderabad;audi;rbi;cinema;telugu;history;sri krishna;chennai;joseph vijay;nandamuri taraka rama rao;father;nijamTue, 29 Dec 2020 11:13:21 GMTభావన కలుగుతుంది. ఎన్టీఆర్ వేసిన శ్రీకృష్ణుడి పాత్ర గాని, విజయ్ చందర్ వేసిన సాయిబాబా, జీసస్ పాత్రలు గాని ఈ భావనను కలుగజేస్తాయి. కరుణామయుడు సినిమాలో జీసస్ గా విజయ్ చందర్ నటన అమోఘం. ఏసుక్రీస్తు నిజంగా ఇలానే ఉంటారేమో అన్న ఫీలింగ్ ని ఆయన కల్పించారు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా జీసస్ మీద తీసిన సినిమాల్లో ఈ సినిమా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాకి విజయ్ చందర్ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

అయితే ఈ సినిమా తీయడానికి ఆయన జీసస్ కంటే ఎక్కువ కష్టాలు పడ్డారనే చెప్పుకోవాలి. ఎందుకంటే జీసస్ కి మహిమలు ఉన్నట్టు, ఈయన దగ్గర మహిమలు లేవుగా. అందుకే కష్టమైనా వెనుకడుగు వేయకుండా కరుణామయుడు చిత్రాన్ని పూర్తి చేశారు. ఆరు లక్షలతో సినిమా స్టార్ట్ చేస్తే మూడు, నాలుగు రీళ్లకే తెచ్చిన ప అయిపోయింది. కేవలం ఆయన చేతిలో 2 వేలు మాత్రమే మిగిలాయి. దీంతో అమృతవాణి సంస్థ వారి సపోర్ట్ తో బ్యాంకుల ద్వారా మూడు లక్షలు, హైదరాబాద్ లో ఉన్న విజయ్ చందర్ తండ్రి గారి 11 ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన ఐదు లక్షలతో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. మళ్ళీ డబ్బు సరిపోక షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో మద్రాస్ లోని పాండిబజార్ లో తెలిసిన వాళ్ళని 5 లక్షలు అప్పు ఇమ్మని చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ ఎవరూ అప్పు ఇవ్వలేదు సరికదా పిచ్చోడివి అంటూ హేళన చేశారు. అయినా సరే పట్టుదలతో ముందుకు అడుగు వేశారు. తనకు తెలిసిన చర్చి ఫాదర్ ల దగ్గర కొంత అమౌంట్ తీసుకోవడం, కొంత భాగం పూర్తి చేయడం చేస్తూ వచ్చారు. కానీ సినిమాని కంప్లీట్ చేయడానికి ఇంకా డబ్బులు కావాల్సి ఉంది. ఎవరూ అప్పు ఇవ్వకపోవడంతో విజయ్ చందర్ తెగించి, పేకాటలో డబ్బు గెలవాలని అనుకున్నారు. 2 వేల రూపాయలతో మద్రాస్ లోని ఆంధ్రక్లబ్ లోకి అడుగుపెట్టి 20 రోజులు కంటిన్యూగా ఆడి పది లక్షలు సంపాదించారు. ఆ డబ్బుతో సినిమాని కంప్లీట్ చేసి చరిత్ర సృష్టించారు. ఇలా కరుణామయుడు సినిమా వెనుక విజయ్ చందర్ పట్టుదల, కృషి, కష్టం, శ్రమ ఎన్నో దాగిఉన్నాయి. అందుకే దేవుడు ఆయన కష్టానికి రెట్టింపు  ఫలితాన్ని అతని ఖాతాలో వేసి సంతోషపరిచారు.




రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

కరోనా రాకముందు విడుదలై.. భారీ డిజాస్టర్లుగా మిగిలిన ఈ సినిమాలు గుర్తున్నాయా?

వీహెచ్ కి రేవంత్ అభిమాని లేఖ

శ్రీవిష్ణు కు అదృష్టం వరించనుందా?

తిరుప‌తి గెలుపు బాధ్య‌త ఆ నేత‌కే... జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో సంచ‌ల‌నం... కేంద్ర మాజీ మంత్రికి కాషాయ కండువా రెడీ...!

ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>