PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/21-uk-passengers-tested-coivd-positive-in-telangana71a4e216-5e91-4f90-bb05-44af5f45c6f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/21-uk-passengers-tested-coivd-positive-in-telangana71a4e216-5e91-4f90-bb05-44af5f45c6f1-415x250-IndiaHerald.jpgకరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో కొత్త రకం వైరస్ కేసు వరంగల్ లో నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్ లో పెట్టి గమనిస్తున్నారు వైద్యాధికారులు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో సోమవారం మరో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైరస్ బారిన పడిన యూకే ప్రయాణికుల సంఖ్య తెలంగాణలో 21కి పెరిగిందిcoivd strain;suma;suma kanakala;hyderabad;eatala rajendar;warangal;telangana;district;nalgonda;director;minister;doctor;medchal;ranga reddy;central government;sangareddy;siddipet;etela rajender;mancherial;jagtial21 మందికి కరోనా! 156 మంది ఎక్కడ?21 మందికి కరోనా! 156 మంది ఎక్కడ?coivd strain;suma;suma kanakala;hyderabad;eatala rajendar;warangal;telangana;district;nalgonda;director;minister;doctor;medchal;ranga reddy;central government;sangareddy;siddipet;etela rajender;mancherial;jagtialTue, 29 Dec 2020 08:56:00 GMTతెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో కొత్త రకం వైరస్ కేసు వరంగల్ లో నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్ లో పెట్టి గమనిస్తున్నారు వైద్యాధికారులు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో సోమవారం మరో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో  వైరస్ బారిన పడిన యూకే ప్రయాణికుల సంఖ్య
తెలంగాణలో  21కి పెరిగింది.తాజాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మేడ్చల్ జిల్లాకు చెందినవారని, దీంతో ఆ జిల్లాలో ఇప్పటివరకు బ్రిటన్ నుంచి వచ్చినవారిలో తొమ్మిది మందికి వైరస్ సోకినట్లయిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ నగరానికి చెందినవారు నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందినవారు ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

           బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇంకా  156 మంది జాడ దొరకడం లేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ అధికారులను కలవరపెడుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన మొత్తం 1216మందిలో ఇప్పటివరకు 996 మందిని గుర్తించి వైద్య పరీక్షలు చేశామని, ఇందులో ముప్పై మంది మినహా మిగిలినవారందరికీ నెగెటివ్ వచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 21మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా మరో తొమ్మిది మంది రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ఇక 156మంది వివరాలను సేకరించగలిగినా వారిని గుర్తించలేకపోయామని తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్ళిపోయారని, 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారని వివరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మొత్తం 996 మందిని గుర్తించడంపై వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభినందనలు తెలియజేశారు.


      వైరస్ బారిన పడినవారిలో గరిష్టంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారు తొమ్మిది మంది ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం వేర్వేరు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి శాంపిళ్ళను పరిశీలించిన సీసీఎంబీ రిపోర్టులను కూడా రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు అందజేసింది. అయితే వారికి సోకిన వైరస్ కొత్త స్ట్రెయినా లేక పాతదా అనేదానిపై రాష్ట్ర అధికారులు వెల్లడించడానికి సుముఖంగా లేరు. తమకు అందిన రిపోర్టులను కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖకు పంపామని, వివరాలను అక్కడే అధికారులు వెల్లడిస్తారని, ఇక్కడ బహిర్గతం చేయవద్దన్న ఆదేశం మేరకు వెల్లడించడంలేదని ఓ అధికారి పేర్కొన్నారు.






ఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావు

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>