PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇటీవల నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఇక్కడ అన్ని ప్రధాన పార్టీలు గెలిచేందుకు అప్పుడే వ్యూహాలు రచించే పనిలో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాస్త టెన్షన్ పడుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి ఆ పార్టీని ఇప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంతో... గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సరికొత్త ఎత్తుగkcr telangana nagarjuna sagar mla nomula narasimh;auto;view;kcr;tara;bharatiya janata party;congress;mla;letter;janareddy;party;narasimhaవారసుడా కొత్త అభ్యర్ధా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న గులాబీ బాస్ ?వారసుడా కొత్త అభ్యర్ధా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న గులాబీ బాస్ ?kcr telangana nagarjuna sagar mla nomula narasimh;auto;view;kcr;tara;bharatiya janata party;congress;mla;letter;janareddy;party;narasimhaMon, 28 Dec 2020 22:00:00 GMTతెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇటీవల నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఇక్కడ అన్ని ప్రధాన పార్టీలు గెలిచేందుకు అప్పుడే వ్యూహాలు రచించే పనిలో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాస్త టెన్షన్ పడుతుంది. 




దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి ఆ పార్టీని ఇప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంతో... గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సరికొత్త ఎత్తుగడలకు తెరతీశారు. దుబ్బాకలో దివంగత సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. అయితే అక్కడ సానుభూతి పవనాలు వీయకపోవడంతో బీజేపీ అనూహ్యంగా గెలిచింది. ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే అవకాశం కనిపించకపోవడంతో, ఎవరిని ఎంపిక చేయాలని దానిపైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నోముల నర్సింహయ్య కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ కు ఇష్టం లేకపోవడంతో,  మరో ప్రత్యామ్నాయ నేత కోసం వెతుకులాట మొదలుపెట్టారు.




 అలాగే నోముల నరసింహ కుటుంబం నుంచి పెద్దగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టపడకపోవడం తో అదే సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలా అనే విషయం పైనా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి అభ్యర్థి అవుతారు. ఒకవేళ ఆయన బీజేపీ లోకి వెళ్ళినా ఆయన రంగంలో ఉండే అవకాశం ఉండడంతో, ఆయన బలమైన నేత కావడంతో ఆయనను ఢీకొట్టే మరో బలమైన నేత కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు పేర్లు పరిశీలనకు వచ్చినా, గెలుపు పై అనే సందేహాలు ఉండడంతో మరికొద్ది రోజులు దీనిపై దృష్టి పెట్టి గెలిచే అభ్యర్థి కి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.



విజయం మీదే: జీవితం ఒక రహస్యం..మీరు ఛేదిస్తారా...?

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>