PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smart-phones-using1e583beb-d556-415c-948e-a22ef4e659eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/smart-phones-using1e583beb-d556-415c-948e-a22ef4e659eb-415x250-IndiaHerald.jpgఫోన్ అనేది ఒకప్పుడు అవసరానికి మాత్రమే వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అవసం ఉన్నా లేకున్నా కూడా వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అంటే ఆ మాత్రం ఉంటాది.. అయితే ప్రస్తుత రోజుల్లో ఫోన్ అనేది వ్యసనం లాగా మారింది.. ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు ఈ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారు..ఒకప్పుడు ఫోన్ ఉంటే రిచ్ అనేవాళ్ళు ..కానీ ఇప్పుడు బిక్షగాడి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. కాలం మారింది.. టెక్నాలజీ మారింది.. దాంతో పాటుగా తక్కువ ధరలకే ఫోన్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి..దీంతో ఫోన్ కు ఉన్న విలువ పూర్తిగా తగ్గిపోయింsmart phones using;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;kanna lakshminarayana;media;cm;survey;vegetable market;parents;aprilమనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..smart phones using;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;kanna lakshminarayana;media;cm;survey;vegetable market;parents;aprilMon, 28 Dec 2020 12:02:41 GMTఫోన్ అనేది ఒకప్పుడు అవసరానికి మాత్రమే వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అవసం ఉన్నా లేకున్నా కూడా వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అంటే ఆ మాత్రం ఉంటాది.. అయితే ప్రస్తుత రోజుల్లో ఫోన్ అనేది వ్యసనం లాగా మారింది.. ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు ఈ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారు..ఒకప్పుడు ఫోన్ ఉంటే రిచ్ అనేవాళ్ళు ..కానీ ఇప్పుడు బిక్షగాడి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. కాలం మారింది.. టెక్నాలజీ మారింది.. దాంతో పాటుగా తక్కువ ధరలకే ఫోన్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి..దీంతో ఫోన్ కు ఉన్న విలువ పూర్తిగా తగ్గిపోయింది. 



పగలు, రాత్రన్న తేడాలేదు.. తిండిపై ధ్యాసలేదు. పక్కవాళ్లు మాట్లాడుతున్నారన్న సోయిలేదు.. మనోళ్లతో గడపాలన్న ఆలోచనలేదు.. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటేచాలు బతుకంతా దాంతోనే అన్నట్టు గడిపేస్తున్నారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ, దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఒకరోజులో సగటున ఏడుగంటలు ఫోన్‌ను వినియోగిస్తున్నట్టు సైబర్‌ మీడియా రిసెర్చ్‌ (సీఎంఆర్‌) ఫర్‌ వివో సంస్థ సర్వేలో తేలింది. ఈ సంస్థ ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు దేశంలోని 8 నగరాల్లో 15-45 ఏండ్ల మధ్య వయసుకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సేకరించింది.. అంతేకాదు వాళ్ళు బాహ్య ప్రపంచం కన్నా కూడా డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా విహరిస్తున్న ట్లుగా తేల్చి చెప్పారు.



లాక్‌డౌన్‌ నుంచి పాఠశాలలు, కళాశాలల ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించడంతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసినట్టు సర్వే తెలిపింది. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులున్న కుటుంబాల్లో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తుంటే.. వాటిని పిల్లలకు ఇచ్చి కొత్త ఫోన్లు కొన్నట్టు సర్వేలో వెల్లడైంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు.. ఇంట్లో తాత, అమ్మమ్మ, నానమ్మ దగ్గర ఉండే అవకాశం దొరుకడంతో వాళ్లకు కూడా స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని అలవాటు చేసినట్టు తేలింది. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఖాళీగా ఉంటూ ఫోన్లను అలవాటు చేసుకున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వాడకం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సగటున 7 గంటలకు పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. సెల్‌ఫోన్‌ను అప్పుడప్పుడు స్విచ్చాఫ్‌ చేసి పక్కన పెట్టడం ద్వారా తమ వాళ్లతో కాస్త ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ, వీరిలో 18 శాతం మంది మాత్రమే దీన్ని పాటిస్తున్నట్టు సర్వేలో తేలింది. ఇకపోతే చాలా మంది తమ వాళ్ళతో స్మార్ట్ ఫోన్ల ద్వారా అందుబాటులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.. 





కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>