PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fear-fear-with-new-strain-coronaf2ea6082-6b0d-49de-81c3-f08f5374bd70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fear-fear-with-new-strain-coronaf2ea6082-6b0d-49de-81c3-f08f5374bd70-415x250-IndiaHerald.jpgబ్రిటన్ నుంచి వచ్చిన హైదరాబాద్ వచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరికి సోకింది కొత్త స్ట్రెయినా కాదా అనే దానిపై సీసీఎంబీ జీన్ మ్యాప్ సిద్ధం చేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఉన్న స్ట్రెయిన్ గురించి నివేదికను ఆరోగ్యశాఖ అధికారులకు అందించింది. ఈ నెల 9 నుంచి బ్రిటన్ నుంచి 1,216 మంది తెలంగాణకు వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా సోకిన వారిని వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచారు. వీరితోfear fear with new strain corona;hyderabad;nellore;marchకొత్త స్ట్రెయిన్ తో భయం భయం..!కొత్త స్ట్రెయిన్ తో భయం భయం..!fear fear with new strain corona;hyderabad;nellore;marchMon, 28 Dec 2020 17:00:00 GMTహైదరాబాద్ వచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరికి సోకింది కొత్త స్ట్రెయినా కాదా అనే దానిపై సీసీఎంబీ జీన్ మ్యాప్ సిద్ధం చేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఉన్న స్ట్రెయిన్ గురించి నివేదికను ఆరోగ్యశాఖ అధికారులకు అందించింది. ఈ నెల 9 నుంచి బ్రిటన్ నుంచి 1,216 మంది తెలంగాణకు వచ్చారు. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా సోకిన వారిని వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న మరో 79 మందిని గుర్తించి, క్వారంటైన్‌ చేశారు. అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు సీసీఎంబీకి పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ అలజడి రేపుతోంది. కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్లీ ఈ తరహా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కొంతమందిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. యూకే నుంచి వచ్చిన 10-12 రోజులకు లక్షణాలు బయటపడటంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించి ఏపీలో పదిమంది చికిత్స పొందుతున్నారు. అయితే లండన్‌ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కనిపిస్తున్న లక్షణాలు కొత్త రకానివేనని వైద్యులు అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ ముగ్గురికి ఇవే లక్షణాలు కనిపించాయి. అయితే ఇది కొత్త స్ట్రెయిన్‌ ద్వారా వచ్చిందా, ఇప్పటికే ఉన్నదేనా అనే విషయం సోమవారం వచ్చే రిపోర్టుల్లో తేలనుంది. తొలి విడతలో బీభత్సం సృష్టించిన కరోనా మొదటి కేసు నెల్లూరులోనే నమోదయింది. మార్చి 12న ఆరోగ్యశాఖ ఆ జిల్లాలో తొలి కేసును గుర్తించింది. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ ‌కు సంబంధించిన తొలికేసు కూడా నెల్లూరులోనే నమోదయ్యే అవకాశం ఉందని వైద్యులు అనుమానిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన డ్రై రన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు.
 





శతకోటి లింగాల్లో బోడి లింగం నాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అచ్చెన్న దెబ్బ బిజెపికి కలిసి వస్తుందా...?

లోకేష్ దెబ్బ... కేశినేని ఇబ్బంది పడుతున్నారా...?

తెలిసిన వాడే కదా అని వెళితే...

సీబీఐకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఏపీ నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్.. ఫ్లెక్సీ కలకలం

చేతి వేలి ముద్రలు లేని ఏకైక కుటుంబం.. ఎక్కడుందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>