PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/annaf6b71a4d-2ef7-45a3-a67f-e1b7fc6fe567-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/annaf6b71a4d-2ef7-45a3-a67f-e1b7fc6fe567-415x250-IndiaHerald.jpgకొందరు నాయకులు ఉంటారు. వారికి ఏ పదవులూ ఉండవు. కానీ జనంలో చాలా బలవంతులు. వారు చెప్పిన మాటలను జనాలు చాలా శ్రధ్ధగా వింటారు. వారి మీద ఎంతో నమ్మకం ఉంచుతారు. ఒక విధంగా వేగవంతంగా సాగిపోతున్న జీవితంలో అన్ని సమస్యల మీద జనాలు పోరాటం చేయడానికి ముందుకు రారు. ఎవరేంటి అన్నది కూడా తూకాలు పట్టి బేరీజు వేయలేరు. అటువంటి సమయంలో కొందరి నేతల మాటల వల్లనే వారు విశేషంగా ప్రభావితం అవుతారు. anna;modi;jeevitha rajaseskhar;sheela;tara;mohandas karamchand gandhi;arvind kejriwal;congress;january;central government;v;party;sheila dikshitఆయన్ని తట్టుకోవడం మోడీ సర్కార్ కి కష్టమే...?ఆయన్ని తట్టుకోవడం మోడీ సర్కార్ కి కష్టమే...?anna;modi;jeevitha rajaseskhar;sheela;tara;mohandas karamchand gandhi;arvind kejriwal;congress;january;central government;v;party;sheila dikshitMon, 28 Dec 2020 22:00:00 GMT
అలాంటి వారిలో ఇపుడు అతి ముఖ్యుడు. అగ్రగణ్యుదు అయిన వారు  అన్నా హజారే. ఆయన సామాజిక సేవా కార్యకర్త. ఆయన అవినీతికి వ్యతిరేకంగా 2011 ప్రాంతంలో చేసిన నిరాహార దీక్ష దేశం మొత్తం కదిపి కుదిపింది. ఆయన వల్లనే ఢిల్లీలో నాటి కాంగ్రెస్ నాయకత్వంలోని షీలా దీక్షిత్ సర్కార్ కుప్పకూలింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఇప్పటికి పదేళ్ళుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

అంటువంటి అన్నా హజారే పుణ్యమాని యూపీయే సర్కార్ కూడా 2014 ఎన్నికల్లఒ దారుణంగా ఓడిపోయింది. మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేనాటికే యూపీయే సర్కార్ వ్యతిరేక భావజాలాన్ని జనంలోకి బలంగా నాడు అన్నా హజారే పంపించగలిగారు. దాంతో మోడీ పని సులువు అయింది. ఆయనలో కొత్త నాయకుడిని చూసిన జనం మోజు మీద ఓట్లేసి ఫుల్ మెజారిటీతో పీఎంని చేశారు.

అటువంటి అన్నా హజారే ఇపుడు మళ్ళీ దీక్ష అంటున్నారు. తాను రైతులకు మద్దతుగా జనంలోకి వస్తాను అంటున్నారు. రైతుల విషయంలో జనవరి నెలాఖరు లోగా అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కూడా అన్నా హజారే అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే మాత్ర దీక్ష చేపడతాను అని గట్టిగానే హెచ్చరించారు. మరి అన్నా హజారే అమరణ దీక్ష చేపడితే తట్టుకోవడం మోడీ సర్కర్ కి చాలా కష్టమే. ఎటువంటి మచ్చ లేని అభినవ గాంధీ అయిన అన్నా హజారే దీక్ష అంటే కేంద్ర ప్రభుత్వానికి కడు ఇబ్బంది కరమే సుమా.




లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!

మొత్తానికి ఒక్క యాడ్ తో... టోటల్ బాలీవుడ్ కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడుగా .....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>