MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mayuri30a6509c-fdb8-4e79-a5ec-74f5be02925f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mayuri30a6509c-fdb8-4e79-a5ec-74f5be02925f-415x250-IndiaHerald.jpgఒక ఏడాదిలో ఎన్నో సినిమాలు రూపొందుతుంటాయి. అందులోనూ తెలుగు సినీ చిత్రరంగంలో సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే సినీ చరిత్రలో మైలు రాళ్లుగా నిలిచిపోతాయి. అలాంటి అపురూప చిత్రాల వెనుక అనూహ్యమైన చరిత్ర ఉంటుంది. అలాంటి తెలుగు సినిమాయే మయూరి.. 1980ల్లో వచ్చిన ఈ సినిమా నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి బయోపిక్ అంటూ గత స్మృతులను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఓ ప్రమాదంలో కాలుకోల్పోయిన నాట్య కళాకారిణి సుధాచంద్రన్‌ నిజ జీవిత చిత్mayuri;koti;sudha chandran;chandran new;geetha;jeevitha rajaseskhar;ramoji rao;cinema;history;interview;cheque;heroine;father;indian;nijamఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావుఫ్లాష్‌బ్యాక్: ఆ హీరోయిన్‌కు బ్లాంక్‌ చెక్ ఆఫర్ చేసిన రామోజీరావుmayuri;koti;sudha chandran;chandran new;geetha;jeevitha rajaseskhar;ramoji rao;cinema;history;interview;cheque;heroine;father;indian;nijamMon, 28 Dec 2020 23:00:00 GMTచరిత్ర ఉంటుంది. అలాంటి తెలుగు సినిమాయే మయూరి.. 1980ల్లో వచ్చిన ఈ సినిమా నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి బయోపిక్ అంటూ గత స్మృతులను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

ఓ ప్రమాదంలో కాలుకోల్పోయిన నాట్య కళాకారిణి సుధాచంద్రన్‌ నిజ జీవిత చిత్రమే మయూరి. అంతే కాదు.. తన బయోపిక్‌లో తనే నటించడం కూడా చాలా అరుదనే చెప్పాలి. మయూరి సుధాచంద్రన్ జీవిత కథ గురించి ఓ పత్రికలో చదివిన రామోజీరావు.. ఆ కథను తెరకెక్కించాలని భావించారు. ఆ తర్వాత ఆమె అనుమతితో కథ తయారు చేశారట. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా సుధాచంద్రన్‌ను అనుకోలేదట. ఆ తర్వాత కథా చర్చల్లో భాగంగా సుధా చంద్రన్‌తో మాట్లాడినప్పుడు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మీరే నటించండంటూ సుధా చంద్రన్‌ను ప్రోత్సహించారట.

మరో విచిత్రం ఏంటంటే.. మయూరి సినిమా పూర్తయ్యే వరకూ అసలు రామోజీరావును  సుధాచంద్రన్ కలవనేలేదట. సినిమా పూర్తయ్యాక రామోజీరావు  సుధాచంద్రన్ కుటుంబాన్ని పిలిపించుకున్నారట. ఆనాటి రోజులను గుర్తు చేసుకున్న సుధాచంద్రన్.. తనకు రామోజీరావు బ్లాంక్‌ చెక్ టేబుల్ పై ఉంచి మీకు తోచినంత రాసుకోమని చెప్పారట. కానీ సుధాచంద్రన్ తండ్రి.. తన కూతురి జీవితాన్ని తెరకెక్కించడమే మాకు అసలైన పారితోషకం.. మీకు తోచినంత ఇవ్వండని రామోజీరావుతో అన్నారట.

మొత్తానికి మయూరి సినిమాకు రామోజీరావు సుధాచంద్రన్‌కు అప్పట్లోనే లక్షా 25 వేల రూపాయలు పారితోషకంగా ఇచ్చారట. 35 ఏళ్ల క్రితం.. మొదటి సినిమాకు అంత పారితోషకం ఇవ్వడం అంటే ఇప్పట్లో దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువ అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు సుధా చంద్రన్.. గ్రేట్ కదా..


కళ్యాణ్ రామ్ డూ ఆర్ డై.. దిల్ రాజుతో క్రేజీ ప్రాజెక్ట్..!

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>