Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/impotent-became-doctor-in-keralacff6c9d3-cc24-4ebd-af44-ea245a1bc5b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/impotent-became-doctor-in-keralacff6c9d3-cc24-4ebd-af44-ea245a1bc5b5-415x250-IndiaHerald.jpgలారెన్స్ తీసిన కాంచన సినిమా చూశారుగా. అందులో కాంచన పాత్ర గుర్తుందా..? చిన్నప్పటినుంచే హిజ్రా కావడంతో తల్లిదండ్రులు కాంచనను ఇంటి నుంచి తరిమేస్తారు. అయితే బయటకు వచ్చిన కాంచన మరో హిజ్రాను కష్టపడి చదివించి డాక్టర్‌ను చేస్తుంది. సరిగ్గా ఇలాంటి కథే కేరళలో జరిగింది. అవును తమ బిడ్డలో స్త్రీ లక్షణాలు ఉండడం తల్లిదండ్రులు భరింలేకపోయారు. డాక్టర్లు కూడా...kanchana;women;raghava lawrence;cinema;bengaluru 1;degree;doctor;kanchana;ayurveda;stree;manamలారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!kanchana;women;raghava lawrence;cinema;bengaluru 1;degree;doctor;kanchana;ayurveda;stree;manamMon, 28 Dec 2020 20:27:00 GMTఇంటర్నెట్ డెస్క్: లారెన్స్ తీసిన కాంచన సినిమా చూశారుగా.  అందులో కాంచన పాత్ర గుర్తుందా..? చిన్నప్పటినుంచే హిజ్రా కావడంతో తల్లిదండ్రులు కాంచనను ఇంటి నుంచి తరిమేస్తారు. అయితే బయటకు వచ్చిన కాంచన మరో హిజ్రాను కష్టపడి చదివించి డాక్టర్‌ను చేస్తుంది. సరిగ్గా ఇలాంటి కథే కేరళలో జరిగింది. అవును తమ బిడ్డలో స్త్రీ లక్షణాలు ఉండడం తల్లిదండ్రులు భరింలేకపోయారు. డాక్టర్లు కూడా ’మీ బిడ్డ హిజ్రా’అని చెప్పడంతో వారు చాలా బాధపడ్డారు. కానీ సినిమాలోలా ఇంట్లో నుంచి తరిమెయ్యలేదు. తమ బిడ్డ పురుషుడి నుంచి స్త్రీగా మారేందుకు అంగీకరించారు. అలాగే ఆమె చదువుకోవాలనుకున్న డాక్టర్ చదివించారు.

హిజ్రాలనాగానే మనందరికీ గుర్తుకొచ్చేది.. చప్పట్లు కొడుతూ దుకాణాల్లో, రైళ్లలో, భిక్షాటన చేసేవారే. కానీ తమ కలలను నిజం చేసుకోవడానికి అహర్నిశలూ శ్రమించి చివరకు లక్ష్యాన్ని సాధించే వారూ ఉన్నారు. అలాంటి ఓ హిజ్రానే కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వీఎస్ ప్రియ. ప్రియ చిన్నప్పటి పేరు జిను శశిధరన్‌. అతడిలో చిన్నప్పటి నుంచి స్త్రీ లక్షణాలున్నాయి. ఊహ తెలిసి.. వయసు వచ్చేసరికి విషయం అర్థమైంది. అయితే తల్లిదండ్రులకు దీనిగురించి చెప్పాలంటే భయపడ్డాడు. దీంతో తాను శారీరకంగా ఎదుర్కొంటున్న సమస్యలను డెయిరీలో రాసుకున్నాడు.

ఆ తరువాత కొన్నాళ్లకు ఎలాగోలా విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే వారు శశిధరన్‌ను మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఆ డాక్టర్ శశిధరన్‌కు ఎలాంటి మానసిక సమస్య లేదని చెప్పాడు. దీంతో అతడి బాధను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. వారిద్దరూ నర్సింగ్ వృత్తిలో ఉండటంతో తమ పిల్లలు డాక్టర్లు కావాలని కలలు కన్నారు. అనుకున్నట్టుగానే తన సోదరుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా చేరాడు. కానీ శశిధరన్ మాత్రం సాధారణ వైద్యం కాకుండా వైద్యరత్నం ఆయుర్వేద కళాశాల‌లో ‘బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద’ డిగ్రీ పూర్తి చేశాడు.

2018లో సీతారామ్ ఆయుర్వేద ఆసుపత్రిలో డాక్టర్‌గా చేరాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ శశిధరన్‌ హిజ్రా అనే గుర్తింపు అనుక్షణం అతడిని ఇబ్బందులకు గురిచేసేది. దీంతో సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులతో చెప్పాడు. దీనికి వారి తల్లిదండ్రులు అంగీకరించారు. శశిధరన్‌ను ప్రియగా మారేందుకు ఒప్పుకున్నారు. అయితే సాధారణంగా లింగ మార్పిడి చేయించుకునేందుకు 3 లక్షల వరకూ ఖర్చవుతుంది.  కానీ శశిధరన్ 8 లక్షల వరకూ ఖర్చు చేసి పరిపూర్ణ లింగ మార్పిడి చేయించుకున్నాడు.  చివరికి ఆపరేషన్ పూర్తయింది. ‘అతడు’గా శశిధరన్ ఇప్పుడు ‘ఆమె’గా మారి ప్రియగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇలాంటి వ్యక్తులు హిజ్రాల్లో ఇంకెంతో మంది ఉన్నారు. మనం హిజ్రాలను కూడా సమాజంలో బతికేలా ప్రోత్సహించాలి. అంతేకాదు వారిని తక్కువ చూపు చూడడం విడనాడాలి.


జడ్జిగా పాల వ్యాపారి కూతురు!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!

మొత్తానికి ఒక్క యాడ్ తో... టోటల్ బాలీవుడ్ కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడుగా .....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>