MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varma-divorce223d3fa3-bffc-4180-83b7-8dd9d98632ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varma-divorce223d3fa3-bffc-4180-83b7-8dd9d98632ba-415x250-IndiaHerald.jpgరామ్ గోపాల్ వర్మ, ఈ పేరు ఒకప్పుడు సెన్సేషనల్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వివాదాలు లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు. అంతలా వివాదాల్లో తల దూర్చే వర్మకి దేవుళ్ళన్నా, సాంప్రదాయాలన్న విలువ లేదు.varma divorce;ilayaraja;ram gopal varma;revathi;sridevi kapoor;deva;geetha;prema;ram pothineni;urmila;bollywood;sangeetha;media;love;husband;wife;heroine;father;vవర్మని అతని భార్య వదిలేయడానికి అసలు కారణం అదేనా?వర్మని అతని భార్య వదిలేయడానికి అసలు కారణం అదేనా?varma divorce;ilayaraja;ram gopal varma;revathi;sridevi kapoor;deva;geetha;prema;ram pothineni;urmila;bollywood;sangeetha;media;love;husband;wife;heroine;father;vMon, 28 Dec 2020 11:38:19 GMTరామ్ గోపాల్ వర్మ, ఈ పేరు ఒకప్పుడు సెన్సేషనల్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు  వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వివాదాలు లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు. అంతలా వివాదాల్లో తల దూర్చే వర్మకి దేవుళ్ళన్నా, సాంప్రదాయాలన్న విలువ లేదు. వీటి మాట అలా ఉంచితే కట్టుకున్న భార్య మీద, కన్న బిడ్డ మీద కూడా కనీసం ప్రేమ కూడా చూపించారు. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేవి ఆయన డిక్షనరీలోనే లేవు. ఇలాంటి వాడు కాబట్టే వర్మని ఆయన భార్య వదిలేశారు. వర్మ భార్య పేరు, రత్న. సాంప్రదాయ కుటుంబం నుంచి ఈమెకు, వర్మ మనస్తత్వానికి అస్సలు మ్యాచ్ అయ్యేది కాదట.

ఓ సందర్బంలో వర్మ, "తనకి మంచి భార్య దొరికింది గాని, ఆమెకే మంచి భర్త దొరకలేదని" వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తన భార్య తనను వదిలేయడానికి అసలు కారణం "గజల్స్" అని చెప్పుకొచ్చారు. రత్న గారికి గజల్స్ అంటే ఇష్టమట, వర్మకేమో ఇళయరాజా సంగీతం అంటే ఇష్టమట. రోజూ ఇంట్లో ఆమె గజల్స్ వింటుంటే, వర్మ ఇళయరాజా సాంగ్స్ వినేవారు. అలా వీరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి విడిపోయారని వర్మ వెర్షన్. అయితే అసలు కారణం అది కాదని, హీరోయిన్స్ తో వర్మకి ఉన్న ఎఫైర్సే విడిపోవడానికి అసలు కారణమని ఇప్పటికీ వార్తలు వస్తాయి. వర్మ శ్రీదేవిని ఎంతగా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన శ్రీదేవి మీద మక్కువ చంపుకోలేదు. ఇక ఆమె తర్వాత అంతలా ఆరాధించే నటి ఊర్మిళ. అప్పట్లో ఈ నటితో వర్మ ఎఫైర్ కూడా నడిపారు. అయితే వర్మ, ఊర్మిళతో ఉంటున్నారన్న విషయం తెలిసి వర్మ భార్య రత్న, వర్మను చెంప మీద కొట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ విడిపోవడానికి ఇదే అసలు కారణమని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. వర్మ మాత్రం గజల్స్ వల్ల విడిపోయామని సిల్లీ రీజన్ చెప్పుకొస్తున్నారు. వర్మ అబద్ధాలు ఆడతాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇక రత్నకి, వర్మకి పుట్టిన కూతురు రేవతి కూడా వర్మని వ్యతిరేకిస్తారు. ఒక బ్యాడ్ ఫాదర్ అంటూ ఆమె ద్వేషిస్తారు. ఇప్పటికీ వర్మ కూతురు ఏం చదువుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియనంత శాడిస్ట్ గా వర్మ ఎంతమందికో ఆదర్శంగా నిలిచారు. భార్యనే వదిలేసిన వాడికి, కూతురిని పట్టించుకునేంత ప్రేమ ఎక్కడుంటుంది చెప్పండి అని విమర్శించేవాళ్ళు విమర్శిస్తుంటారు. 


కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>