PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/indirect-fight-between-ysrcp-leaders-9e9f8ab2-b7e3-41cb-a0a3-df38a85c9a1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/indirect-fight-between-ysrcp-leaders-9e9f8ab2-b7e3-41cb-a0a3-df38a85c9a1f-415x250-IndiaHerald.jpgమ‌రోవైపు నెల్లూరులో రెడ్డి సామాజిక వ‌ర్గం దూకుడు ఎక్కువగా ఉండ‌డంతో ఇక్క‌డ పాగా వేసేందుకు ఒక‌వైపు టీడీపీ మ‌రోవైపు బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ ఆనంతో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. గ‌త కొన్నాళ్లుగా ఆనంను పార్టీ వ‌ర్గాలు చాలా వ‌ర‌కు దూరం పెట్టాయి. పైగా అసంతృప్తితో ఉన్న వారిని తీసుకుంటే.. పార్టీ ఇంకాముందుకు సాగుతుంద‌ని అంటున్నారు. దీంతో ఆనం రేపో మాపో.. క‌మ‌లం గూటికి వెళ్తార‌నే ప్ర‌చారం ఊపందుకుందిysrcp;bharatiya janata party;nellore;smart phone;minister;letter;tdp;reddy;partyవైసీపీలో ఆ కీల‌క నేత‌.. కాడి ప‌డేస్తారా..?వైసీపీలో ఆ కీల‌క నేత‌.. కాడి ప‌డేస్తారా..?ysrcp;bharatiya janata party;nellore;smart phone;minister;letter;tdp;reddy;partyMon, 28 Dec 2020 10:11:52 GMTఅధికార వైసీపీలో అందునా.. సీఎం జ‌గ‌న్ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క‌నేత ఒంటర‌య్యార‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హితుడుగా పేరు తెచ్చుకున్న ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిపోయిం ది. ఆయ‌న పార్టీలో ఉండాలో .. వ‌ద్దో .. నిర్ణ‌యించుకునేందుకు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు నెల్లూరులో రెడ్డి సామాజిక వ‌ర్గం దూకుడు ఎక్కువగా ఉండ‌డంతో ఇక్క‌డ పాగా వేసేందుకు ఒక‌వైపు టీడీపీ మ‌రోవైపు బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ ఆనంతో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. గ‌త కొన్నాళ్లుగా ఆనంను పార్టీ వ‌ర్గాలు చాలా వ‌ర‌కు దూరం పెట్టాయి.

నిజానికి జ‌గ‌న్ అదికారంలోకిరాగానే ఆనంకు ఆర్థిక శాఖ మంత్రి ప‌గ్గాలు ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. పోనీ.. మ‌రేదైనా శాఖ‌ను ఇస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ, ఆనంకు ఎలాంటి ప్రాధాన్యం ద‌క్క‌లేదు. పైగా జిల్లాలో కూడా ఆయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఆనం ప‌రిస్థితి దిన‌దిన అవ‌మానంగా మారిపోయింది. తాజాగా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మానికి సంబందించి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి చివ‌ర‌లో పిలిచారు. అంతేకాదు, ప్రొటోకాల్ ప్ర‌కారం.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రెవ‌రు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతున్నార‌నే విష‌యాన్ని కూడా అధికారులు ఆయ‌న‌కు చెప్ప‌లేదు. ఇది వివాదానికి దారితీసి.. స‌బ్ క‌లెక్ట‌ర్ హాజ‌రైతే.. నాకు క‌నీసం స‌మాచారం ఇవ్వాలి క‌దా? అని ఆనం ప్ర‌శ్నించ‌డం తెలిసిందే.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ధ్య‌లో ముగించి ఆనం వెళ్లిపోయారు. ఆ వెంట‌నే బీజేపీ నేత‌ల నుంచి ఫోన్ వ‌చ్చింద‌ని  నియోజ‌క‌వ‌ర్గంలో ఆనం అనుచ‌రుల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. వైసీపీలో అవ‌మానాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని త‌ర‌చుగా ఆనం చెబుతున్నారు. దీనికి తోడు ఆయ‌నను ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌,  ప్ర‌స్తుతం బీజేపీ బ‌ల‌ప‌డేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎవ‌రు క‌లిసి వ‌చ్చినా.. పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయ‌కులు రెడీగా ఉన్నారు.

అయితే.. ఈ క్ర‌మంలోనే రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నెల్లూరు, ప్ర‌కాశంల‌లో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని పార్టీలో చేర్చుకునే అవ‌కాశం మెండుగా ఉంద‌ని నాయ‌కులు లెక్క‌లు వేసుకున్నారు. పైగా అసంతృప్తితో ఉన్న వారిని తీసుకుంటే.. పార్టీ ఇంకాముందుకు సాగుతుంద‌ని అంటున్నారు. దీంతో ఆనం రేపో మాపో.. క‌మ‌లం గూటికి వెళ్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


తిరుపతి... వైసీపీ భారీ టార్గెట్ ?

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>