SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa4c9ebcd-d2c2-4cf1-9621-073ad4769901-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa4c9ebcd-d2c2-4cf1-9621-073ad4769901-415x250-IndiaHerald.jpgదశాబ్దాపు అత్యుత్తమ క్రికెట్‌ జట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ దశాబ్దపు అత్యుత్తమ కెప్టెన్ గా వన్డే, టి20 ఫార్మర్ లకు గాను మహేంద్రసింగ్ ధోని ఎంపిక చేసింది.ఇక టెస్టు ఫార్మాట్‌కు విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. sports news;ms dhoni;virat kohli;bangladesh;australia;new zealand;sri lanka;naga aswin;international;icc t20;steve smith;indian;james cameronఈ దశాబ్దపు అత్యుత్తమ కెప్టెన్లు వీరే..!!ఈ దశాబ్దపు అత్యుత్తమ కెప్టెన్లు వీరే..!!sports news;ms dhoni;virat kohli;bangladesh;australia;new zealand;sri lanka;naga aswin;international;icc t20;steve smith;indian;james cameronMon, 28 Dec 2020 08:07:12 GMTఅంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ దశాబ్దపు అత్యుత్తమ కెప్టెన్ గా వన్డే, టి20 ఫార్మర్ లకు గాను మహేంద్రసింగ్ ధోని ఎంపిక చేసింది.ఇక టెస్టు ఫార్మాట్‌కు విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అత్యుత్తమ వన్డే జట్టులో ధోనితో పాటు కోహ్లి, రోహిత్‌ శర్మలు భారత్‌ నుంచి ఎంపికయ్యారు. మొత్తం మీద ఐసీసీ ప‍్రకటించిన అత్యుత్తమ జట్లలో(టెస్టు, వన్డే, టీ20) ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు స్థానం దక్కించుకోవడం విశేషం. ధోని, కోహ్లిలతో పాటు రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఉన్నారు.

 ఇంకా వన్డే ఫార్మాట్ కు గాను ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్‌లకు స్థానం దక్కగా, బంగ్లాదేశ్ నుంచి షకీబల్ హసన్, ఇంగ్లండ్ నుంచి బెన్ స్టోక్స్‌లకు చోటిచ్చింది.టెస్టు జట్టులో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చోటు లభించగా, ఇద్దరు ఆస్ట్రేలియా, ఇద్దరు టీమిండియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నుంచి ఒక్కో ఆటగాడికి ఈ జట్టులో స్థానం లభించింది. విరాట్ కోహ్లీకి టెస్టు జట్లు పగ్గాలు అప్పగించింది. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసింది. అది కూడా ఇండియన్ ప్లేయర్ కావడం విశేషం. అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్‌లను ఓపెనర్లుగా పేర్కొంది. అంతే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.

 అందులో మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది. వన్డే ఫార్మాట్ కు ఎంపికైన జట్టును చూసినట్లయితే..ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌),  రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, తాహీర్‌, మలింగా అలాగే టెస్ట్ ఫార్మాట్ గాను..అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కుమార సంగక్కర (వికెట్ కీపర్), బెన్‌స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.


‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>