PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaram632253e3-1204-4fd6-a33b-bc6c4c1161a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaram632253e3-1204-4fd6-a33b-bc6c4c1161a7-415x250-IndiaHerald.jpg దీంతో స‌ద‌రు ఇళ్ల‌పై నీలి మేఘాలు క‌మ్ముకున్నాయి. అయినా కూడా ఆమంచి అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అన్ని వివ‌రాలు అందించారు. అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నిరూపించే అన్ని ప‌త్రాలు ఇచ్చారు. కానీ, ఆమంచి ఎదిగితే.. టీడీపీకి దెబ్బ అవుతుంద‌ని ఇచ్చిన స‌మాచారంతో ఈ ప్రాజెక్టుకు టీడీపీలో ఉన్న సునీత, పాలేటి రామారావు వంటి వారు.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్రాజెక్టును ముందుకు సాగనిచ్చేది లేద‌ని భీష్మించారు. ఫ‌లితంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.karanam balaram;pothula suneetha;scheduled caste;letter;tdp;chirala;partyస్వామి వివేకానంద కాల‌నీ.. సంగ‌తేంటి క‌ర‌ణం.. ?స్వామి వివేకానంద కాల‌నీ.. సంగ‌తేంటి క‌ర‌ణం.. ?karanam balaram;pothula suneetha;scheduled caste;letter;tdp;chirala;partyMon, 28 Dec 2020 10:44:36 GMTచీరాల ముఖ‌చిత్రంలో అతిపెద్ద పేద‌ల కాల‌నీ ఏదైనా ఉంటే.. అది స్వామివివేకానంద కాల‌నీ. 2014లో ఇక్క డ నుంచి న‌వోద‌యం పార్టీ త‌ర‌ఫున స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు, ముఖ్యంగా ఎస్సీ వ‌ర్గాల‌కు గూడు ఏర్పాటు చేయాల‌నే ఉద్దేశంతో చీరాల శివారు ప్రాంతంలో భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేశారు. దీనికి స‌బంధించిన బ‌డా పారిశ్రామిక వేత్త‌ల నుంచి విరాళాలు సేక‌రించి.. మ‌రీ ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డారు. దాదాపు వెయ్యి మంది పేదల‌కు భూములు కేటాయించారు.

అయితే, అప్ప‌ట్లో దీనిని రాజ‌కీయం చేసిన అప్ప‌టి టీడీపీ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ పోతుల సునీత అడుగ ‌డుగునా అడ్డుప‌డ్డారు. ఇళ్ల‌లో అవినీతి జ‌రిగింద‌ని.. ఆరోపించారు. దీంతో స‌ద‌రు ఇళ్ల‌పై నీలి మేఘాలు క‌మ్ముకున్నాయి. అయినా కూడా ఆమంచి అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అన్ని వివ‌రాలు అందించారు. అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నిరూపించే అన్ని ప‌త్రాలు ఇచ్చారు. కానీ, ఆమంచి ఎదిగితే.. టీడీపీకి దెబ్బ అవుతుంద‌ని ఇచ్చిన స‌మాచారంతో ఈ ప్రాజెక్టుకు టీడీపీలో ఉన్న సునీత, పాలేటి రామారావు వంటి వారు.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్రాజెక్టును ముందుకు సాగనిచ్చేది లేద‌ని భీష్మించారు.
ఫ‌లితంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ఆమంచి టీడీపీకి దూర‌మ‌య్యారనే టాక్ ఉంది. ఇక‌, ఇప్పుడు సునీత‌, క‌ర‌ణం, పాలేటి రామారావులు వైసీపీలోకి వ‌చ్చారు. మ‌రి ఇప్ప‌టికైనా.. త‌మ‌ను ప‌ట్టించుకోవాల‌ని, ఇక్క‌డి వారు కోరుతున్నారు. అయితే.. వీరు మాత్రం రాజ‌కీయ క‌క్ష‌ల‌తో పేద‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ జోరుగా న‌డుస్తోంది. తాము పెట్ట‌రు... పెట్టేవారిని పెట్ట‌నివ్వ‌రు.. అని పేద‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
ఇది పూర్త‌యితే ఎంతో మంది పేద‌ల సొంతింటి క‌ల నెర‌వేరుతుంది. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పుకొనే నాయ‌కులు.. మ‌రి ఈ స్థ‌లాల సంగ‌తేంటో చూడాలని ఇక్క‌డి వారు కోరుతున్నారు. లేక‌పోతే.. వీరికి రాజ‌కీయ స‌మాధి క‌ట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్న విష‌యం గ్ర‌హించాలి.




చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>