HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/neem-leaves69c0be07-ed09-467d-8b9c-0b5a206f1575-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/neem-leaves69c0be07-ed09-467d-8b9c-0b5a206f1575-415x250-IndiaHerald.jpgఉదయాన్నే వేపాకును ఎలా తింటారు?అందులోనూ చేదుగా ఉంటుంది? ఏ స్ట్రాంగ్ కాఫీ, టీ అయితే తాగుతాము.అందులోనూ ఉదయాన్నే వేపాకును తినాలి అంటే చాలా కష్టం బాబోయ్. అనే ఆలోచనలో మీరు పడ్డారా? నిజమే ఉదయాన్నే అందులోనూ పరగడుపున వేపాకు తినాలంటే కష్టమే.కానీ పరగడుపునే వేపాకులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో? ప్రత్యేకంగా ఆరోగ్య నిపుణులు ఎందుకు చెప్పవలసి వచ్చిందో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. neem leaves;cheque;neem;coffeeఉదయాన్నే వేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?ఉదయాన్నే వేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?neem leaves;cheque;neem;coffeeMon, 28 Dec 2020 10:30:00 GMT
ఉదయాన్నే వేపాకును ఎలా తింటారు?అందులోనూ చేదుగా ఉంటుంది? ఏ స్ట్రాంగ్ కాఫీ, టీ అయితే తాగుతాము.అందులోనూ ఉదయాన్నే వేపాకును తినాలి అంటే చాలా కష్టం బాబోయ్. అనే ఆలోచనలో మీరు పడ్డారా?  నిజమే ఉదయాన్నే అందులోనూ పరగడుపున వేపాకు తినాలంటే కష్టమే.కానీ పరగడుపునే వేపాకులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో? ప్రత్యేకంగా ఆరోగ్య నిపుణులు ఎందుకు చెప్పవలసి వచ్చిందో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

వేపాకు సర్వరోగ నివారిణి. ఈ వేపాకులో 50 జాతులకు పైగా రకాలు ఉన్నాయి. అంతేకాకుండా గత నాలుగు వేల సంవత్సరాల నుంచి వేపాకును ఔషధంగా వాడుతున్నారు.ఉదయాన్నే వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు శుభ్రం అవడమే కాకుండా, చిగుళ్ళు కూడా గట్టిపడతాయి. దీర్ఘకాలిక పంటి నొప్పి వంటి సమస్యలు ఉంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. నోటినుంచి దుర్వాసన రావడాన్ని అరికడుతుంది.

చర్మం మీద ఏదైనా గాయాలు,పుండ్లు, సెప్టిక్ లాంటివి అయినప్పుడు వేప రసాన్ని రాయడం వల్ల త్వరగా మానుతాయి.వేపకాయల నుంచి తీసిన నూనెను మెడిసిన్స్,సబ్బులు,షాంపూలు, హ్యాండ్ వాష్ లాంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు.వేపాకులను చూర్ణాన్ని చిన్న గుళికలుగా చేసుకొని రోజూ పరగడుపున తినడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను సమానంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. ప్రేగులకు ఏదైనా పుండ్లు అయినప్పుడు ఈ వేపాకు రసం మంచి ఔషధంలా పనిచేస్తుంది.

అంతే కాకుండా ముఖంపైన వచ్చే మొటిమలు కూడా తగ్గించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. గజ్జి, ఆటలమ్మ లాంటి  వ్యాధులు వచ్చినప్పుడు  వేపాకుల చూర్ణానికి,పసుపు, ఒక చిటికెడు ఉప్పు కలిపి శరీరమంతటా మర్దనా చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే ఉపసమనం కలుగుతుంది.ఇన్ని మంచి ఔషధ గుణాలు కలిగిన వేపాకును రోజు తినడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటాము. చేదు వినాశనానికి కారణం అన్నట్టు వేపాకులు మన శరీరానికి మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.




21వ రోజూ కూడా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

అభిమానులపై రజినీ ఫ్యామిలీ ఆగ్రహం..

ప్రాంతీయ పార్టీల కీలక సమావేశం

‘బంగార్రాజు’లో శివగామి ఆ పాత్రలో నటించనుందా?

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>