Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ganguly49856a3b-58f0-4c72-81c3-0f28908eac0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ganguly49856a3b-58f0-4c72-81c3-0f28908eac0a-415x250-IndiaHerald.jpgకేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని..ganguly;amit shah;arun;delhi;cricket;bharatiya janata party;west bengal - kolkata;arun jaitley;media;sourav ganguly;bcci;minister;governor;letter;central government;mamta mohandasఅమిత్ షాతో గంగూలీ.. బీజేపీలోకి వచ్చేందుకేనా..? గంగూలీ ఏం చెప్పారంటే..అమిత్ షాతో గంగూలీ.. బీజేపీలోకి వచ్చేందుకేనా..? గంగూలీ ఏం చెప్పారంటే..ganguly;amit shah;arun;delhi;cricket;bharatiya janata party;west bengal - kolkata;arun jaitley;media;sourav ganguly;bcci;minister;governor;letter;central government;mamta mohandasMon, 28 Dec 2020 19:19:00 GMTఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా హాజరయ్యారు. రూ.15 లక్షల విలువైన 6 అడుగుల జైట్లీ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో గంగూలీ-షా ఒకే వేదికపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య రాజకీయ పరంగా కొంత చర్చ జరిగిందని, రాబోయే బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గంగూలీ కాషాయ కండువా కప్పుకోనున్నారని అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సౌరవ్ గంగూలీ త్వరలో బెంగాల్ రాజకీయాల్లోకి అడుగుపెడతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఏకంగా అమిత్ షాతో కలిసి ఒకే వేదికపై కనిపించడంతో ఇక కచ్చితంగా దాదా కమలదళంలో చేరిపోతారని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకే గంగూలీ బీజేపీ ఉపయోగించుకోబోతున్నట్లు కూడా అనేక రూమర్లున్నాయి. ఇలాంటి తరుణంలో ఆదివారం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను గంగూలీ కలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు గవర్నర్‌ను కలవాల్సిన అవసరం గంగూలీకి ఏముందంటూ ప్రశ్నలు వినిపించాయి. దీనికి తోడు అమిత్ షా, గంగూలీ కలవడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది..

అయితే అమిత్ షాతో భేటీ వార్తలను గంగూలీ ఖండించాడు. ఈ కార్యక్రమానికి గంగూలీ బయలుదేరగానే మీడియా గంగూలీ రాజకీయ ప్రవేశం గురించి ప్రశ్నించింది. అయితే తాను ఢిల్లీకి వెళుతున్నది, మైదానంలో విగ్రహావిష్కరణ కోసమేనని, రాజకీయ చర్చకు కాదని తేల్చి చెప్పేశారు. ‘ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించిన కార్యక్రమానికి మాత్రమే హాజరవుతున్నాను. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎటువంటి భేటీ లేద’ని గంగూలీ చెప్పారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను కలిసిన విషయంపైనా గంగూలీ వివరణ ఇచ్చారు. గవర్నర్‌తో సమావేశంలో ఎటువంటి రాజకీయ కోణం లేదని, గవర్నర్ తనను కలవాలి అనుకున్నారని, అందుకే తాను వెళ్లానని, ఆయన కలవాలి అనుకుంటే ఎవరైనా వెళ్లాల్సిందేనని, అందువల్ల ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుందని దాదా సమాధానమచ్చారు.


భారత్-ఆస్ట్రేలియాల మ్యాచ్‌లో స్లెడ్జింగ్

లారెన్స్ ‘కాంచన’ చూశారా.. ఈమె రియల్ కాంచన.. ఒక్కటే తేడా!

భారత్ లో పెరుగుతున్న కరోనా...కొత్త స్ట్రెయిన్ టెన్షన్...?

పోలీసులు జగన్ ని ఇబ్బంది పెడతారా...?

అదే జరిగితే టీడీపీకి సినిమానే...?

మీ సి‌ఎం సాబ్ కు చెప్పండి.." వకీల్ సాబ్ " చెప్పాడని..!!

పోస్టల్ స్టాంపులపై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. ఇదేందయ్యా ఇది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>