PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/govt-employees-hopes-on-telangana-cm-kcr80e75586-e302-4096-b2f6-d63bb79644b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/govt-employees-hopes-on-telangana-cm-kcr80e75586-e302-4096-b2f6-d63bb79644b0-415x250-IndiaHerald.jpgనియంత్రిత సాగు విధానాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రైతు సంఘాలు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మినహా, ఇతర ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెబుతోంది. నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయబోతోంది. రెండు రోజుల్లో దీనిపై కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి. kcr;kcr;amala akkineni;pragathi;bharatiya janata party;telangana;chief minister;februaryరైతులతో గొడవ.. ఉద్యోగులకు వరాలు.. కేసీఆర్ రూటే సెపరేటు..రైతులతో గొడవ.. ఉద్యోగులకు వరాలు.. కేసీఆర్ రూటే సెపరేటు..kcr;kcr;amala akkineni;pragathi;bharatiya janata party;telangana;chief minister;februaryMon, 28 Dec 2020 12:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రైతు సంఘాలు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మినహా, ఇతర ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెబుతోంది. నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయబోతోంది. రెండు రోజుల్లో దీనిపై కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి.

తెలంగాణలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ఫిట్‌ మెంట్‌ శాతాన్ని ప్రకటించడంతో పాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపు విషయంలో సీఎం కేసీఆర్‌ నెలాఖరులోగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పీఆర్సీకి సంబంధించిన ఫైలు ఆదివారం ప్రగతిభవన్‌కు చేరిందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

పీఆర్సీ కమిటీ గడువు డిసెంబర్‌ 31తో ముగుస్తుంది. దీంతో మరో మూడు నెలలపాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్‌ బిస్వాల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గడువు పొడిగింపుకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రగతి భవన్‌కు చేరినట్టు తెలుస్తోంది. అయితే పీఆర్సీ కమిటీ గడువు పొడిగించడానికి ముందే.. ఫిట్ మెంట్ శాతాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన కొత్త సర్వీసు నిబంధనల రూపకల్పనపై మరో నివేదిక సమర్పించాల్సి ఉండటంతో మరో మూడు నెలలపాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగించవచ్చని తెలుస్తోంది.

గడువు పొడిగింపు ఉత్తర్వులు రాక ముందే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఫిట్‌ మెంట్‌ శాతాన్ని ఖరారు చేస్తారని, ఆ వెంటనే పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021–22 ప్రారంభంనుంచి పెరిగిన వేతనాలను పంపిణీ చేస్తారని అంటున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 2018 మేలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయగా, ఇప్పటికే నాలుగు సార్లు గడువు పొడిగించారు. చివరిసారిగా ఫిబ్రవరి 18న ప్రభుత్వం గడువు పొడిగించింది. మళ్లీ గడువు పొడిగిస్తే ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో ఈసారి కచ్చితంగా పీఆర్సీ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


మనిషి రోజులో ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొత్త దుస్తులకు పసుపు రాయడం వెనుక రహస్యం ఇదే..!

ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇది పరీక్ష కాలమే..?

పాము కరిచినప్పుడు ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

చలికాలంలో పెరుగు మానేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే!

చిరంజీవి తప్పు చేస్తున్నారు.. డాన్స్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>